Begin typing your search above and press return to search.

ఈ సారి న‌క్స‌ల్స్ స్టోరీతో ఆదాశ‌ర్మ‌

వివాదాలు..విమ‌ర్శ‌లు తెచ్చిపెట్టిన‌ప్ప‌టికీ త‌న‌ని ప్రూవ్ చేసుకోవ‌డానికి గొప్ప అవ‌కాశంగా భావించి ప‌నిచేసి స‌క్సెస్ అయింది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 4:37 AM GMT
ఈ సారి న‌క్స‌ల్స్ స్టోరీతో ఆదాశ‌ర్మ‌
X

ముంబై బ్యూటీ ఆదాశ‌ర్మ 'ది కేర‌ళ స్టోరీ'తో ఒక్క‌సారిగా కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కూ అమ్మ‌డు తెలుగు...క‌న్న‌డ చిత్రాల్లో న‌టించినా..ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ అంత‌గా ఐడెంటిటీని తీసుకురాలేదు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో హిందీలో 'కేర‌ళ స్టోరీ'లో న‌టించే అవ‌కాశం రావ‌డం..అది పాన్ ఇండియా లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో అమ్మ‌డి రేంజ్ మారిపోయింది. అలాంటి రోల్స్ కొంద‌రు మాత్రమే చేయ‌గ‌లర‌ని చేసి చూపించింది.

పెర్పార్మెన్స్ తో త‌న‌కంటూ ఓ ఐడెంటిటీని తెచ్చిన రోల్ అది. ఆదా కెరీర్ లో కేరళ స్టోరీ అనేది ఓ మైల్ స్టోన్ చిత్రంగానే నిలిచిపోయింది. వివాదాలు..విమ‌ర్శ‌లు తెచ్చిపెట్టిన‌ప్ప‌టికీ త‌న‌ని ప్రూవ్ చేసుకోవ‌డానికి గొప్ప అవ‌కాశంగా భావించి ప‌నిచేసి స‌క్సెస్ అయింది. తాజాగా కేరళ స్టోరీ టీమ్ మ‌రో సంచ‌ల‌న ప్రాజెక్ట్ తో ముందుకు రావ‌డానికి రెడీ అవుతుంది. 'బ‌స్త‌ర్' అనే సినిమాకి తాజాగా శ్రీకారం చుట్టారు.

'ది న‌క్స‌ల్స్ స్టోరీ' అనేది ఉప‌శీర్షిక‌. సుదీప్తో సేన్ తెర‌కెక్కిస్తున్నారు. విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదాశ‌ర్మ స్పందించింది. కేర‌ళ స్టోరీలో నేను పోషించిన షాలిని పాత్ర‌ను ఎంత‌గానో ఆద‌రించారు. ఆపాత్ర‌తో నాకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. కొత్త త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తున్నారు అన‌డానికి ఆ సినిమా మంచి ఉదాహ‌ర‌ణ‌. ఇలాంటి ప్ర‌య‌త్నాలు మ‌రిన్ని జర‌గాలి.

స‌మాజంలో ఎన్నో సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. వాటిపై అవేర్ నెస్ తీసుకొచ్చేలా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాలో నీర్జా మాధ‌వన్ గా న‌టిస్తున్నాను. షాలిని పాత్ర‌లో ఈ పాత్ర‌ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా'అని అంది. అమ్మ‌డు హీరోయిన్ గా కంటే ఇలాంటి పాత్ర‌ల‌తో ఎక్కువ గుర్తింపు ద‌క్కించుకుంటుంది. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసినా అవేవి ఆదాకి పెద్ద‌గా క‌లిసి రాని సంగ‌తి తెలిసిందే.