Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: అద‌ర తాంబూల సేవ‌నం

భ‌న్సాలీ తెర‌కెక్కించిన క‌ళాత్మ‌క చిత్రం 'రామ్ లీల'లో అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించిన ఈ జంట పెద‌వి ముద్దుల‌తో హుషారెత్తించారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 4:06 AM GMT
టాప్ స్టోరి: అద‌ర తాంబూల సేవ‌నం
X

'యానిమల్‌'లో రష్మిక మందన్న- రణబీర్ కపూర్ చాలా ముద్దు సన్నివేశాల్లో క‌నిపించారు. పెదవి ముద్దుల్లో న‌టించారు అనే కంటే చెల‌రేగారు అంటే త‌ప్పు కాదు. అయితే సినిమాల్లో ఉద్వేగభరితమైన స్టీమియెస్ట్ ముద్దు సన్నివేశాల్లో జీవించిన జంట‌ల‌కు కొద‌వేమీ లేదు. రష్మిక మందన్న-రణబీర్ కపూర్ నుండి దీపికా పదుకొణె-రణవీర్ సింగ్ వరకు చాలా జంట‌లు ఘాటైన‌ ముద్దు సన్నివేశాల్లో జీవించారు.


రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే జంట ప‌లు చిత్రాల్లో పెద‌వి ముద్దుల్లో క‌నిపించారు. భ‌న్సాలీ తెర‌కెక్కించిన క‌ళాత్మ‌క చిత్రం 'రామ్ లీల'లో అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించిన ఈ జంట పెద‌వి ముద్దుల‌తో హుషారెత్తించారు. లవ్ ఎగైన్‌లో ప్రియాంక చోప్రా -సామ్ హ్యూఘన్‌ల సన్నిహిత సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఈ జంట పెద‌వి ముద్దుల్లో చెల‌రేగిపోయి న‌టించారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ బాలీవుడ్ లో ప‌లువురు క‌థానాయ‌కుల‌తో పెద‌వి ముద్దుల్లో జీవించిన సంద‌ర్భాలున్నాయి.


రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర- షబానా అజ్మీల మధ్య ముద్దు సన్నివేశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇందులో రణ్‌వీర్ - అలియా అనేక ముద్దు స‌న్నివేశాల్లో క‌నిపించారు. దీపికా పదుకొనే -సిద్ధాంత్ చతుర్వేది ముద్దు స‌న్నివేశాల్ని అభిమానులు మ‌ర్చిపోలేరు. ఈ జంట‌ను చూసినప్పుడల్లా హాన్ దూబే అనే మాట మాత్రమే వినిపిస్తుంది. ఇది ఆటోమెటిగ్గా మన మనస్సులో ప్లే అవుతుంది. గెహ్రాయాన్ సినిమాలోని స్టీమియెస్ట్ సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటాము.


సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ జంట పెళ్లికి ముందే వేడెక్కించే ముద్దు స‌న్నివేశాల్లో జీవించారు. రియల్ లైఫ్‌.. రీల్ లైఫ్ జోడి కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ అయిన 'షేర్షా'లో స్టీమియెస్ట్ ముద్దు సన్నివేశాల్లో జీవించారు. రణబీర్ కపూర్- శ్రద్ధా కపూర్తు ఝూతి మైన్ మక్కార్ లో ముద్దు స‌న్నివేశాల్లో న‌టించారు. రొమ్-కామ్ లో రణబీర్ - శ్రద్ధా మధ్య చాలా సాన్నిహిత్యం ఉంటుంది. ఈ జంట చెల‌రేగి చాలా ముద్దులు పెట్టుకున్నారు. ప్రతి ముద్దుకు భిన్నమైన వేవ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి.


రణబీర్ కపూర్ - రష్మిక మందన్న 'యానిమల్' సాంగ్ 'హువా మైన్‌..'లో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీపికా పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌లు కూడా చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. యే జవానీ హై దీవానీ - తమాషా లాంటి చిత్రాల్లో స్టీమియెస్ట్ ముద్దు సన్నివేశాల్లో జీవించారు. అదే స‌మ‌యంలో ఆఫ్ ద స్క్రీన్ ఈ జంట రొమాన్స్ సంచ‌ల‌నంగా మారింది.


శ్రద్ధా కపూర్ - టైగర్ ష్రాఫ్‌ల కెమిస్ట్రీ అభిమానుల‌కు ప్ర‌త్యేకం. వీరిద్దరూ కలిసి పలు సినిమాలకు పనిచేశారు. రణవీర్ సింగ్ -వాణి కపూర్ బేఫిక్రేలో కలిసి పనిచేశారు. సినిమా మొత్తం చాలా ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలయ్యాక పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చ సాగింది. ఇటీవ‌ల తెలుగు సినిమాల్లో ఒక‌టికి మించి పెద‌వి ముద్దుల‌ను చూస్తూనే ఉన్నాం. నేటిత‌రం జంట‌లు చెల‌రేగి తెర‌పై చుంబ‌న దృశ్యాల్లో న‌టిస్తున్నారు. ఇది మారిన ట్రెండ్ ని ఎలివేట్ చేస్తోంది.