Begin typing your search above and press return to search.

అలాంటి వాళ్లు ఎక్కువరోజులు ఉండరు..!

ఈ క్రమంలో సినిమాల్లో నటించడం కన్నా దాన్ని మార్కెట్ చేయడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నది

By:  Tupaki Desk   |   17 Aug 2023 7:47 AM GMT
అలాంటి వాళ్లు ఎక్కువరోజులు ఉండరు..!
X

హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. వారిలో కూడా కొందరు దశాబ్ధాలుగా సినిమాలు చేస్తూ ఫాం కొనసాగిస్తే మరికొందరు మాత్రం వచ్చామా ఒక పది పదిహేను సినిమాలు చేశామా వెళ్లామా అన్నట్టు ఉంటారు. ఒక భాషలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కి అన్ని భాషల నుంచి అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు మార్కెట్ ఏమో కానీ ఇప్పుడు హిట్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ కి అన్నివిధాలుగా సపోర్ట్ అందిస్తున్నారు. అయితే హీరోయిన్స్ అందరు ఒకేలా ఆలోచించరు.. ఒకేలా కెరీర్ కొనసాగించలేదు.

వారికి ఉన్న ఆలోచన విధానంతోనే కెరీర్ రాణిస్తారు. హీరోయిన్స్ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కథానాయిక యామి గౌతం. తెలుగులో అల్లు శిరీష్, నితిన్ తో కలిసి నటించిన ఆమె ఇక్కడ హీరోయిన్ గా సక్సెస్ అవలేకపోయింది. సినిమాల కన్నా ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ అలరిస్తుంది యామి గౌతం. యాడ్స్ తోనే పాపులారిటీ తెచ్చుకున్న నటి యామి గౌతం. సౌత్ సినిమాల్లో కనిపించి చాలా కాలమైన ఈ అమ్మడు రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కనిపించింది.

ఈ క్రమంలో సినిమాల్లో నటించడం కన్నా దాన్ని మార్కెట్ చేయడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నది. యాక్టర్స్, టెక్నీషియన్స్ తమ టాలెంట్ కన్నా ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని అన్నారు. హిందీలో కూడా ఇది బాగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఒకరు ఒక సినిమాతో పాపులర్ అవుతుంటే.. మరికొందరు చాలా కాలం కష్టపడి సక్సెస్ అందుకుంటున్నారని అన్నారు యామి గౌతం. అయితే కొంతమంది కేవలం పబ్లిసిటీ ద్వారా సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. అయితే అలాంటి వారు ఎక్కువ కాలం సినిమాల్లో నిలబడలేరని అంటున్నారు యామి గౌతం.

కేవలం పబ్లిసిటీ వల్ల అన్నీ రావని.. కథా వారు చేసే పాత్రల కన్నా ఈ పబ్లిసిటీ తోనే పాపులర్ అవ్వాలని అందరు అనుకుంటున్నారని అన్నారు. తాను మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాయని చెప్పారు. తమలోని టాలెంట్ నమ్మి శ్రమిస్తే సక్సెస్ కచ్చితంగా వచ్చి తీరుతుందని యామి గౌతం అన్నారు. అయితే యామి ఈ కామెంట్స్ తో ఎవరినైనా టార్గెట్ చేసిందా లేదా నిజంగానే ఈ మధ్య యాక్టింగ్ కన్నా పబ్లిసిటీ మీద యాక్టర్స్ దృష్టి పెడుతున్నారని తన అభిప్రాయం చెప్పిందా అన్నది తెలియలేదు. ఏది ఏమైనా యామి గౌతం చెప్పిన దానిలో వాస్తవం ఉంది అన్నది మాత్రం అర్థం చేసుకోవాలి.యాడ్స్ లో నటించి తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న యామి గౌతం ని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు ఆమె ఫాలోవర్స్.