Begin typing your search above and press return to search.

అమెరికాలో టాయిలెట్లు క‌డిగిన న‌టి!

'17 ఏళ్ల వ‌య‌సులో చ‌దువుకోసం అమెరికా వెళ్లాను. అక్క‌డా చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఆర్ధిక క‌ష్టాలు చూసాను. ఖ‌ర్చుల కోసం చిన్న చిన్న ప‌నులు చేసాను. చివ‌రికి ప్లోర్లు కూడా తుడిచాను. టాయిలెట్లు కడిగాను.

By:  Tupaki Desk   |   19 Oct 2023 11:30 PM GMT
అమెరికాలో టాయిలెట్లు క‌డిగిన న‌టి!
X

'ర‌యీస్' చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన పాకిస్తాన్ న‌టి మ‌హీరాఖాన్ సుప‌రిచితమే. అమ్మ‌డు తొలి సినిమాతోనే ఇక్క‌డ భారీ విజ‌యాన్ని అందుకుంది. ఆ స‌క్సెస్ త‌ర్వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. కోట్ల రూపాయ‌ల పారితోషికాలు ఆఫ‌ర్ చేసారు. కానీ అమ్మ‌డు స్వ‌దేశానికి ఇచ్చిన ప్రాధాన్య‌త శ‌త్రుదేశా నికివ్వ‌లేదు. పాకిస్తానీ లోనే సినిమాలు చేస్తాను? త‌ప్ప భార‌తీయ చిత్రాలు చేయ‌న‌ని ఒట్టు పెట్టుకుంది.


అప్ప‌టి నుంచి పాకిస్తానీ చిత్రాల‌తోనే అల‌రిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కెరీర్ ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు ప‌డింద‌న్న విష‌యాన్ని గ‌తంలో ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకుంది. ఇప్పుడా మ్యాట‌ర్ మ‌రోసారి నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. '17 ఏళ్ల వ‌య‌సులో చ‌దువుకోసం అమెరికా వెళ్లాను. అక్క‌డా చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఆర్ధిక క‌ష్టాలు చూసాను. ఖ‌ర్చుల కోసం చిన్న చిన్న ప‌నులు చేసాను. చివ‌రికి ప్లోర్లు కూడా తుడిచాను. టాయిలెట్లు కడిగాను. ప‌రిస్థితులు ఎలాంటి ప‌నులైనా చేయిస్తాని అప్పుడే అర్ధ‌మైంది' అని వ్యాఖ్యానించింది.

ఇప్పుడా వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ‌డు న‌టిగా కెరీర్ ప్రారంభించ‌డానికి ముందు చాలా ఇబ్బందులు ప‌డ‌నట్లు తెలుస్తోంది. నేడు న‌టిగా మెప్పిస్తున్న న‌టీమ‌ణులు చాలా మంది ఆర్ధిక క‌ష్టాలు చూసిన వారే. ఇక మ‌హీరాఖాన్ ఇటీవ‌లే రెండ‌వ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌లీమ్ క‌రీమ్ అనే పాకిస్తానీ వ్యాపార వేత్త‌ను అమ్మ‌డు ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న జోడీ వివాహ బంధంతో ఒక‌టయ్యారు. మ‌హీరాఖాన్ కిది రెండ‌వ వివాహం. మొద‌టి భ‌ర్త‌తో విబేధాలు రావ‌డంతో విడిపోయింది. అప్ప‌టి నుంచి కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉంది. ప్ర‌స్తుతం మ‌హీరాఖాన్ సినిమాల‌కంటే ఎక్కువ‌గా టీవీషోలు చేస్తోంది. గ‌తేడాది వ‌రుస‌గామూడు నాలుగు సినిమా చేసింది. ఆ త‌ర్వాత వెండి తెర‌కు దూర‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. 2022 త‌ర్వాత అమ్మ‌డు ఎలాంటి సినిమాకి సంత‌కం చేసిన‌ట్లు లేదు.