Begin typing your search above and press return to search.

వామ్మో వామికా ఏంటా అందాలు..!

వామికా గబ్బి చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఎందుకంటే, ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేసింది చాలా తక్కువ

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:50 AM GMT
వామ్మో వామికా ఏంటా అందాలు..!
X

వామికా గబ్బి చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఎందుకంటే, ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేసింది చాలా తక్కువ. సుధీర్ బాబు తో కలిసి భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా, వామిక కు పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. అందుకే, మళ్లీ తెలుగులో కనిపించింది లేదు.


అయితే, తెలుగులో ఎక్కువగా చేయకపోయినా, ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలే చేసింది. తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో నటించింది. ఎక్కువగా పంజాబీ చిత్రాలు చేసింది. అక్కడ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇక్కడి ప్రేక్షకులకు డైరెక్ట్ గా సినిమాల ద్వారా కాకుండా, సోషల్ మీడియాలో తన అందాలతో అదరగొడుతోంది.


అయితే, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. నిత్యం తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అది చూస్తే, బాబోయ్ ఏంటా అందాలు అనకుండా ఉండలేరు. మామూలుగానే వామికా చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక, తన అందాలు కనిపించేలా, ముఖ్యంగా యూత్ ని ఆకర్షించేలా తన సొయగాలు కనిపించేలా ఫోటో షూట్స్ చేయడంలో ముందుంటుంది.


తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తుంటే, వర్షాకాలంలో అయినా ఎవరికైనా చెమటలు పట్టేంచేలా ఉండటం విశేషం. స్కిన్ కలర్ డ్రెస్ లో, లైట్ మేకప్ తో విండో పక్కన కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. టూ మచ్ హాట్ గా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.


ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటి ఫోటోలు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కుప్పలు గా ఉన్నాయి. ఆమె అందానికి, సొగసులకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో క్రేజ్ చాలా ఎక్కువ. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో ఏ సినిమా చేయడం లేదు కానీ, హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.