Begin typing your search above and press return to search.

వీడియో : అందాల వేదిక అందమైన షూట్‌

నందమూరి కళ్యాణ్ రామ్ తో విజయ దశమి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక

By:  Tupaki Desk   |   13 Jan 2024 3:15 AM GMT
వీడియో : అందాల వేదిక అందమైన షూట్‌
X

నందమూరి కళ్యాణ్ రామ్ తో విజయ దశమి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా ఆశించిన స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకోలేదు. అయినా కూడా ఆఫర్లు మాత్రం బాగానే దక్కించుకుంది.


టాలీవుడ్ తో పాటు ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ మరియు మలయాళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాలు మరియు సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోల కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ఈసారి వేదిక తన అందమైన ఫోటో షూట్‌ వీడియో తో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. ఈ అమ్మడి వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుందా అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా అందంగా కెమెరా కు ఫోజ్ ఇస్తూ ఉన్న ఈ వీడియో లో వేదిక చాలా అందంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా కూడా ఉండటం విశేషం. ఈ మధ్య కాలంలో మళ్లీ బిజీ అయిన ఈ అమ్మడు నెట్టింట షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు లో ఈ అమ్మడు బిజీ అయ్యేనా అనేది చూడాలి.