Begin typing your search above and press return to search.

కుమార్తెని హీరోయిన్ చేయ‌డం కోసం న‌టి క‌ష్టాలు!

కోలీవుడ్ లో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన వనితా విజయకుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచి త‌మే

By:  Tupaki Desk   |   26 Aug 2023 12:27 PM GMT
కుమార్తెని హీరోయిన్ చేయ‌డం కోసం న‌టి క‌ష్టాలు!
X

కోలీవుడ్ లో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన వనితా విజయకుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచి త‌మే. 'దేవి'.. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'మ‌ళ్లీ పెళ్లి' లాంటి చిత్రాల్లో న‌టించింది. చిత్ర పరిశ్ర‌మ‌లో చాలా కాలంగా ఉంటుంది. విజయ్ హీరోగా నటించిన 'చంద్రలేఖ' చిత్రంతో అరంగేట్రం చేసిన వనితా విజయ్ కుమార్.. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. కానీ ఆమెకి రావాల్సిన గుర్తింపు రాలేదు.

ఈ మ‌ధ్య పెళ్లిళ్ల విషయంలోనూ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ న‌టి తాను సాధించ‌లే నిది కుమార్తెల రూపంలో సాధించాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. వనితా విజ‌య్ కుమార్ కుమార్తె జోవిక‌ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. కుమార్తె కోసం మంచి క‌థ కోసం ఎదురు చూస్తోంది. ఎలాంటి హీరో అయినా ప‌ర్వాలేద‌ని..క‌థ అందులో త‌న కుమార్తె పాత్ర మాత్రం బలంగా ఉండాల‌ని కోరుకుంది. అలాగే కుమార్తెకి యాక్టింగ్ ట్రైనింగ్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదని తెలుస్తోంది.

ఏకంగా దీపికా ప‌దుకొణే... ప్రీతి జింటా..హృతిక్ రోష‌న్ లాంటి న‌టీన‌టులు శిక్ష‌ణ తీసుకున్న సంస్థ‌లోనే ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ ఇప్పించిందిట‌. అలాగే జోవిక కొత్త ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ లో కుర్ర కారుకి సెగ‌లే పెట్టించే జోవిక ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. లాంగ్ షాట్స్..క్లోజ‌ప్ షాట్స్ లో క్లిక్ మ‌నిపించిన ఫోటోల్ని మార్కెట్ లోకి వ‌దిలింది. అమ్మ‌డు వ‌య్యారంగా కెమారాకి ఇచ్చిన ఫోజులు నెట్టింట కాక పుట్టిస్తున్నాయి.

మ‌రి జోవిక ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి అవ‌కాశాలు అందుకుంటుందో చూడాలి. వ‌నితా విజ‌య్ కుమార్ లాగే తెలుగులోనూ కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు త‌మ కుమార్తెల్ని సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యానికి ముందే ప్ర‌మోట్ చేస్తున్నారు. కుమార్తెల్ని మోడలింగ్ లోకి దించ‌క‌పోయినా..అంత‌కు మించి అనిపించేలా డిజైన‌ర్ దుస్తుల్లో ఇండస్ట్రీని ఆక‌ట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. అవ‌స‌రం మేర ముందే సినిమా సెట్స్ వాతావ‌ర‌ణాన్ని ప‌రిచ‌యం చేస్తున్నారు. అలాగే విదేశాల్లో ఏవైనా తానా స‌భ‌లు...ఇతర వేడుక‌ల‌కు లాంటివి నిర్వ‌హించిన వెంట కుమార్తెల్ని తీసుకెళ్తున్నారు. ఆ ర‌కంగా కొంత ప‌బ్లిసిటీ కూడా దొరుకుతుంది.