Begin typing your search above and press return to search.

సిద్దు..అషిశ్ తో వైష్ణ‌వి రొమాన్స్!

'బేబి' హిట్ తో తెలుగు అమ్మాయి వైష్ణ‌వి చైత‌న్య‌కి మంచి గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి బోల్డ్ పెర్పార్మెన్స్ కి భారీగా ఫాలోవ‌ర్స్ పెరిగారు

By:  Tupaki Desk   |   6 Sep 2023 7:26 AM GMT
సిద్దు..అషిశ్ తో వైష్ణ‌వి రొమాన్స్!
X

'బేబి' హిట్ తో తెలుగు అమ్మాయి వైష్ణ‌వి చైత‌న్య‌కి మంచి గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డి బోల్డ్ పెర్పార్మెన్స్ కి భారీగా ఫాలోవ‌ర్స్ పెరిగారు. దీంతో కొత్త అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. తాజాగా బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాల్లో ఛాన్సులందుకుని అభిమానుల్ని స‌ర్ ప్రైజ్చేసింది. యంగ్ హీరోలు సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌... అశిష్ ల‌తో రొమాన్స్ చేయ‌బోతుంది. ప్ర‌స్తుతం సిద్దు హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే.

ఇందులో హీరోయిన్ గా ప‌లువురి భామ‌లి ప‌రిశీలించి చివ‌రిగా వైష్ణ‌విని తీసుకున్నారు. ఈ విష‌యంలో సిద్దు నే ద‌ర్శ‌కుడిని క‌న్విన్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆ పాత్ర‌కి తెలుగు అమ్మాయి అయితే బాగుంటుం ద‌ని భావించి ద‌ర్శ‌కుడు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే అషిశ్ హీరోగా అరుణ్ భీమ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా వైష్ణ‌విని తీసుకోమ‌ని దిల్ రాజు సూచించిన‌ట్లు స‌మాచారం.

ఈ రెండు అవ‌కాశాలు కూడా బేబి విజ‌యంతో దక్కిన‌వే. వైష్ణ‌వికి మంచి అవ‌కాశాలు కూడా. బేబి త‌ర్వాత ఎలాంటి సినిమాలో క‌నిపిస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున‌నారు. ఈ నేప‌థ‌యంలో ఇద్ద‌రు యంగ హీరోల‌తో న‌టించే ఛాన్స్ అందుకోవ‌డం విశేషం. హిట్ వస్తే తెలుగులో అవ‌కాశాలు ఇస్తార‌ని వైష్ణ‌వి నిరూపించింది. తెలుగులో తెలుగు హీరోయిన్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని చాలా ఆరోప‌ణ‌లున్నాయి.

అయితే ఎంట్రీ ఇచ్చి నిల‌బ‌డిన హీరోయిన్లు చాలా త‌క్కువ మంది. సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేసింది కూడా చాలా త‌క్కువ మందే. ఆ విష‌యంలో వైష్ణ‌వి ఓ సంక‌ల్పంతో ప‌నిచేసింది. ఛాన్స్ కోసం ఎనిమిదేళ్ల‌గా వెయిట్ చేస్తోంది. అప్ప‌టివ‌ర‌కూ యూ ట్యూబ‌ర్ గా...షార్ట్ ఫిల్ములు చేసింది. ఇదే స‌మ‌యంలో సినిమా ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలో బేబిలో అవ‌కాశం రావ‌డం...హిట్ అవ్వ‌డం అన్నీ క‌లిసొచ్చాయి. ఇప్పుడు బిజీ న‌టిగా మారుతుంది. అవ‌కాశాలు రాలేదు అని విమ‌ర్శించే వాళ్ల‌కి వైష్ణ‌వి లాంటి వాళ్లు స్పూర్తి.