Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : మినీ డ్రెస్ లో అందాల ఊర్వశి

వెండి తెరపై మాత్రమే కాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో కూడా కంటిన్యూ చేస్తోంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:19 AM GMT
పిక్‌ టాక్ : మినీ డ్రెస్ లో అందాల ఊర్వశి
X

2015లో మిస్ దివా యూనివర్స్‌ టైటిల్ ను గెలుచుకున్న ఊర్వశి రౌటేలా బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో అందాల ఆరబోత పాత్రల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. గత ఏడాది ఏకంగా నాలుగు తెలుగు సినిమాల్లో ఐటం సాంగ్ లో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా ఈ సారి కూడా మరింత సందడి చేయబోతుంది.


వెండి తెరపై మాత్రమే కాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో కూడా కంటిన్యూ చేస్తోంది. రెగ్యులర్ గా ఇన్ స్టా లో ఊర్వశి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడి యొక్క ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.


తాజాగా మరోసారి మినీ డ్రెస్ లో థైస్ అందాలను ఎక్స్‌ పోజ్ చేస్తూ టాప్ టూ బాటమ్‌ అందమైన తన రూపంను ప్రదర్శించడం ద్వారా ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా వైరల్ గా మారింది. ఆకట్టుకునే అందంతో పాటు మినీ డ్రెస్ లో ఈమె స్కిన్‌ షో కి అంతా ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా కంటే కూడా అధికంగా ఈమెకు ఐటం సాంగ్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అయినా కూడా వాటితో ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది ఆమె నుంచి మరో అరడజను సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది.