Begin typing your search above and press return to search.

బ్లాక్ రోజ్ లా మెరిసిపోతున్న ఊర్వశి

ఫ్యాషన్ ఐకాన్ గా ఆమెకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అటెండ్ అయ్యింది

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:13 AM GMT
బ్లాక్ రోజ్ లా మెరిసిపోతున్న ఊర్వశి
X

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న అందాల భామ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు ఐటెం క్వీన్ గా వరుసగా సాంగ్స్ చేస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలలో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేసింది. వాల్తేర్ వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాలు ఒకే ఏడాదిలోనే ఉండటం విశేషం. ఐటెం సాంగ్ కోసం ఈ బ్యూటీకి కోటి నుంచి రెండు రెమ్యునరేషన్ ఇస్తున్నారంట.


చేసిన సినిమాలు తక్కువే అయిన ఒకప్పటి మిస్ యూనివర్స్ గా ఊర్వశి రౌతేలాకి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అయితే మిలియన్స్ లో ఈ బ్యూటీకి అభిమానులు ఉండటం విశేషం. ఫ్యాషన్ ఈవెంట్స్ తో పాటు సినిమా ఫంక్షన్స్ లో కూడా ఊర్వశి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఎంత మంది సెలబ్రెటీలు వచ్చిన వారిలో తన స్పెషాలిటీ మాత్రం చూపిస్తూ ఉంటుంది.

ఫ్యాషన్ ఐకాన్ గా ఆమెకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అటెండ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాంక్ తో అదిరిపోయే లుక్ తో మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోలని ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ పిక్స్ ని ఏకంగా రెండు లక్షల మంది లైక్ చేయడం విశేషం. తన కొత్త మూవీ దిల్ హై గ్రే ప్రీమియర్ షో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగింది.

అందులో ఊర్వశి రౌతేలా కూడా పార్టిసిపేట్ చేసి తన హాట్ లుక్స్, మెస్మరైజ్ చేసే కాస్ట్యూమ్స్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా బ్లాక్ రోజ్ లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఊర్వశి అందానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే అంటూ ఈ ఫోటోలు చూస్తున్న వారు రెప్లై ఇస్తున్నారు. ఇండియన్ లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఉన్న ఈ అమ్మడు సౌత్ లో మాత్రం ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.