Begin typing your search above and press return to search.

తమన్నా.. సక్సెస్ లేకున్నా ఆఫర్లే ఆఫర్లు

By:  Tupaki Desk   |   6 Aug 2023 4:40 AM GMT
తమన్నా.. సక్సెస్ లేకున్నా ఆఫర్లే ఆఫర్లు
X

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోన్న అందాల భామ తమన్నా. ఈ అమ్మడు శ్రీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సక్సెస్ కాకపోయిన నెక్స్ట్ హ్యాపీడేస్ తో మొదటి విజయం అందుకొని రచ్చ సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా మారిన మిల్కీ బ్యూటీ తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్స్ అందరితో కూడా ఈ బ్యూటీ ఆడిపాడిందని చెప్పొచ్చు.

ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరో వైపు జైలర్ మూవీలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇవి ఇలా ఉండగానే హిందీలో రెండు వెబ్ సిరీస్ లు కంప్లీట్ చేసింది. అలాగే యంగ్ హీరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా చేతినిండా తమన్నాకి అవకాశాలు ఉండటం విశేషం. ఇవిలా ఉండగానే ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కి జోడీగా పాన్ ఇండియా మూవీకి ఒకే చెప్పింది.

తాజాగా ఈ సినిమాని అఫీషియల్ ఎనౌన్స్ చేశారు. మగీజ్ తిరుమణి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. త్రిష చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తూ ఉండగా సెకండ్ లీడ్ కోసం తమన్నాకి ఎంపిక చేశారు. నిజానికి ఈ ఇద్దరు హీరోయిన్స్ అవుట్ డేటెడ్ అని చెప్పాలి. అయితే త్రిష పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ స్పీడ్ పెంచింది. ఏకంగా స్టార్స్ తో అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

ఇక తమన్నా చేతిలో చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే లేదు. కానీ ఇంకా స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగిస్తోంది. ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆమెతో పాటే కెరియర్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. కానీ సీనియర్ హీరోలకి జోడీగా తమన్నా ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం తమన్నా నుంచి వస్తోన్న భోళా శంకర్, జైలర్ హిట్ పడితే మరో మూడు, నాలు ఏళ్ళు కెరియర్ కి ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోతుంది.

అన్ని ఇండస్ట్రీలలో కూడా చేయడానికి తమన్నా ఇప్పుడు సిద్ధంగా ఉండటం కూడా ఆమె తన ఛరిష్మా ఇంకా కొనసాగించడానికి కారణం అవుతుందని చెప్పాలి. సినిమాలు తగ్గిన కూడా వెబ్ సిరీస్ లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాటిపై ఫోకస్ చేసుకొని లీడ్ యాక్టర్ గా తన ఇమేజ్ ని అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది.