Begin typing your search above and press return to search.

మ్యారేజ్ పై మాట మార్చేసిన తమన్నా..!

మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ ఫుల్ గా 18 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకుంది. చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:07 AM GMT
మ్యారేజ్ పై మాట మార్చేసిన తమన్నా..!
X

మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ ఫుల్ గా 18 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకుంది. చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా తెలుగుతో పాటుగా తమిళ భాషలో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 18 ఏళ్లు కెరీర్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెబుతుంది తమన్నా.

రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ఎంతో సంతోషకరంగా ఉందని అన్నది తమన్నా. రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా పాట తమన్నాని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. నేషనల్ లెవెల్ లో ఈ సాంగ్ సెన్సేషన సృష్టించింది. ఆ సినిమా హిట్ లో కూడా అది భాగమైంది. జైలర్ తో తమన్నా కెరీర్ జోష్ అందుకుంది. కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్న ప్రతిసారి తమన్నాకి ఇలాంటి ఛాన్స్ లే వస్తుంటాయి.

జైలర్ తర్వాత తమన్నాకు మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. వస్తున్న అవకాశాల వల్ల తమ మ్యారేజ్ ని కూడా వాయిదా వేసుకోవాలని అనుకుంటుందట అమ్మడు. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఇద్దరు ఇప్పటికే ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తమన్నా ఎక్కడ ఉంటే విజయ్ వర్మ అక్కడ ఉంటున్నాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రీసెంట్ ఇంటర్వ్యూలో తమన్నాకి పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె తెలివైన ఆన్సర్ ఇచ్చింది. వివాహ వ్యవస్థ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందన్న తమన్నా ఒకానొక దశలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న్నా సరే ప్రస్తుతం మానసిక స్థితి అలా లేదని.. కెరీర్ చాలా బాగా సాగుతుంది కాబట్టి ప్రస్తుతం దీని మీదే దృష్టి పెడతానని.. పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేసింది తమన్నా. ఇంకా డిఫరెంట్ సినిమాలు చేయాలని.. షూటింగ్ స్పాటే తన సంతోషాన్ని ఇచ్చే ప్రాంతంగా భావిస్తున్నానని అన్నది తమన్నా. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తున్న తమన్నా దూకుడు చూస్తుంటే మరో 10 ఏళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో అరణ్మనై 4, హిందీలో వేద సినిమాలో నటిస్తుంది తమన్నా.