Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ మళ్లీ స్పెషల్‌ ట్రీట్‌...!

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఖతం అయింది.. ఆమెకు ఇక ఆఫర్లు రానట్లే అనుకున్న ప్రతి సారి ఆమె ఆ అభిప్రాయంను తప్పు అంటూ నిరూపిస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   8 Dec 2023 1:30 PM GMT
మిల్కీ బ్యూటీ మళ్లీ స్పెషల్‌ ట్రీట్‌...!
X

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ ఖతం అయింది.. ఆమెకు ఇక ఆఫర్లు రానట్లే అనుకున్న ప్రతి సారి ఆమె ఆ అభిప్రాయంను తప్పు అంటూ నిరూపిస్తూనే ఉంది. హీరోయిన్‌ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంతకు ముందు జోరును కొనసాగించలేక పోతుంది. అయితే ఆమె క్రేజ్‌ మాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్‌ గా మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా ఆమె ప్రత్యేక పాటలు, వెబ్‌ సిరీస్‌, మ్యూజిక్‌ ఆల్బం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటోంది. ఇటీవల సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించి సూపర్ హిట్ అయిన జైలర్ లో మిల్కీ బ్యూటీ తమన్నా వా నువ్వు కావాలయ్యా అంటూ అందరినీ ఉర్రూతలూగించిన విషయం తెల్సిందే.

నటిగా చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ప్రత్యేక పాటలు, పాత్రలు చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఈ అమ్మడు ముందుకు వస్తోంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్‌ క్రేజీ మూవీ 'స్త్రీ 2' లో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా జాతీయ మీడియా సంస్థలు ఆసక్తికర కథనాలను రాస్తున్నాయి.

రాజ్‌ కుమార్‌ రావ్‌ మరియు శ్రద్ద కపూర్‌ జంటగా రూపొందుతున్న స్త్రీ 2 సినిమాలో తమన్నా ప్రత్యేక పాటలో కనిపించబోతుందట. ఆ పాటకు సంబంధించిన చిత్రీకరణ జరిగిందని కూడా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న క్రేజ్‌ కచ్చితంగా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.