Begin typing your search above and press return to search.

రెడ్ ఫ్రాక్ లో మిల్కీ బ్యూటీ సెగలు

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దానికి పైగా అవుతోంది. ఇప్పటికి వన్నె తగ్గని అందాలతో ఈ అమ్మడు హీరోయిన్ గా దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   19 Oct 2023 10:47 AM GMT
రెడ్ ఫ్రాక్ లో మిల్కీ బ్యూటీ సెగలు
X

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దానికి పైగా అవుతోంది. ఇప్పటికి వన్నె తగ్గని అందాలతో ఈ అమ్మడు హీరోయిన్ గా దూసుకుపోతోంది. సీనియర్ కేటగిరీలో చేరిపోయిన ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గిన హిందీలో మాత్రం పెరిగాయి. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.


బాలీవుడ్ గడప తొక్కిన తర్వాత తమన్నా అందాల ప్రదర్శనలో పెట్టుకున్న హద్దులు అన్ని చెరిపేసింది. గ్లామర్ రోల్స్ తో పాటుగా ఇంటిమేట్ సన్నివేశాలకి కూడా సై అంటోంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో విజయ్ వర్మతో రొమాంటిక్ సన్నివేశాలలో శృతి మించి ఈ బ్యూటీ నటించేసింది. ఇక నో కిస్సింగ్ పాలసీని పక్కన పెట్టి మరీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగోట్టింది.

ప్రస్తుతం తన కో స్టార్ విజయ్ వర్మతో డేట్ లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఈ రిలేషన్ షిప్ ని ఆశ్వాదిస్తోంది. బాలీవుడ్ వీకెండ్ పార్టీలు, పబ్ లకి బాయ్ ఫ్రెండ్ తోనే కలిసి వెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో తమన్నా ఫోటోషూట్ లు కూడా ఎక్కువయ్యాయి. మ్యాగజైన్ కవర్ పేజీలకి కూడా ఫోజులు ఇస్తుంది. హాట్ హాట్ అందాలతో తన ఫాలోవర్స్ కి కావాల్సినంత నయనానందం అందిస్తోంది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమన్నా అందాలకి కుర్రాళ్ళు కూడా క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. తాజాగా మరోసారి హాట్ ఫోటోలతో ఈ అమ్మడు కనువిందు చేస్తోంది. రెడ్ ఫ్రాక్ లో ఎద అందాలు నిండుగా చూపిస్తూ కుర్రాళ్ళ కలల రాకుమారిగా కనిపిస్తోంది.

ఫోకస్ లైట్ తో ఆమె అందం మరింత రెట్టింపుగా కనిపిస్తోంది.ఈ ఫోటోలని ఏకంగా 2.38 లక్షల మంది వీక్షించడం వీక్షించడం విశేషం. ఈ స్థాయిలో తమన్నా అందాల ప్రదర్శన టాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న సమయంలో ఎప్పుడూ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే నెటిజన్లు నుంచి భిన్నమైన కామెంట్స్ తమన్నా గ్లామర్ ఫోటోలకి వస్తున్నాయి.