Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తన్మ‌యంలో త‌మ‌న్నా

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా ట్రెండ్‌ను సెట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఫ్యాష‌న్ గోల్స్ ప‌రంగా లైమ్‌లైట్‌ను దొంగిలించడంలోను స్పెష‌లిస్ట్

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:21 AM GMT
ఫోటో స్టోరి: తన్మ‌యంలో త‌మ‌న్నా
X

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా ట్రెండ్‌ను సెట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఫ్యాష‌న్ గోల్స్ ప‌రంగా లైమ్‌లైట్‌ను దొంగిలించడంలోను స్పెష‌లిస్ట్. ఈసారి స‌రికొత్త ఫ్యాష‌న్ సెన్స్ తో కుర్ర‌కారు హృద‌యాల‌పై బ‌ల‌మైన ముద్ర‌ను వేసింది. తాజాగా రిలీజైన‌ త‌మ‌న్నా కొత్త లుక్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.


నియాన్-ఇన్ఫ్యూజ్డ్ లుక్‌తో ఫ్యాషన్ ప్రపంచ‌పు క్వీన్ గా త‌మ‌న్నా మెరిసిపోతోంది. రెడ్ కార్పెట్‌పై అడుగు పెడుతూ.. తమన్నా నియాన్ పసుపు రంగు షీర్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌లో అబ్బురపరిచింది. నియాన్ పింక్ సిల్క్ చీరకు నియాన్ షేడ్స్ కాంబినేష‌న్ తో బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. నియాన్ ఎల్లో హాల్టర్ నెక్ బ్లౌజ్ తమన్నాలోని గ్రేస్ ని పెంచడమే కాకుండా సాంప్రదాయ చీరకట్టులో ప్ర‌త్యేక‌త‌ను ఆవిష్క‌రించింది.

ఇది ఒక సాహసోపేతమైన ఎంపిక అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ఇలాంటి లుక్ ఈవెంట్‌లో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. నియాన్ పింక్ సిల్క్ చీర త‌న సొగ‌సును ఎంతో అందంగా ఆవిష్క‌రించింది. యువ‌ ఫ్యాష‌నిస్టాలు విస్మరించలేని ఏకైక ఫ్యాషన్ ఎంపిక ఇది అని కూడా కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

త‌మ‌న్నా స‌హ‌జ‌సిద్ధ‌మైన అందం .. ఆకర్ష‌ణీయమైన క‌ళ్లు ఈ ఫోటోషూట్ లో ప్ర‌ధాన హైలైట్ గా నిలిచాయి. ఇక ఎంపిక చేసుకున్న చీర‌కు త‌గ్గ‌ట్టే పెదవులపై బోల్డ్ వైబ్రెంట్ పింక్ గ్లాస్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌ను జోడిస్తుంది. ఆమె వస్త్రధారణ అలంకరణలో నియాన్ షేడ్స్ కలయిక ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి ఎలివేట్ చేసాయ‌న‌డంలో సందేహం లేదు. తమన్నా భాటియా చరిత్ర సృష్టించింది! షిసిడో బ్రాండ్ కి మొదటి భారతీయ రాయబారి అయ్యారు.

ప్రసిద్ధ జపనీస్ బ్రాండ్ ఒక బహుళజాతి కాస్మెటిక్ కంపెనీ. SHISEIDO కి మొదటి భారతీయ రాయబారిగా తమన్నా ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాల్సి ఉంది. మేకప్ - చర్మ సంరక్షణ కళ ద్వారా తమను తాము వ్యక్తీకరించడానికి యువ‌త‌రానికి స్ఫూర్తిని శక్తిని ఇచ్చే ఉత్ప‌త్తి ఇది. త‌మ‌న్నా ప్ర‌చారం ఇండియాలో క‌లిసొస్తుంద‌ని స‌ద‌రు సంస్థ భావిస్తోంది. మ‌రోవైపు త‌మ‌న్నా వెబ్ సిరీస్ లు, సినిమాల‌తో బిజీగా ఉంది. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంద‌ని స‌మాచారం.