Begin typing your search above and press return to search.

52 లోనూ అదే దూకుడు..ట‌బు త‌గ్గేదేలే!

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది

By:  Tupaki Desk   |   18 March 2024 11:20 AM GMT
52 లోనూ అదే దూకుడు..ట‌బు త‌గ్గేదేలే!
X

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతూనే హాట్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తోంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తుంది. కుర్ర హీరోల‌తో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేస్తోంది. పాత్ర‌ని బ‌ట్టి ట‌బు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ న‌వ‌త‌రం భామ‌ల‌కు ధీటుగా అవ‌కాశాలు అందుకుంటుంది.

`ఖూఫియా`..`బోళా` లాంటి చిత్రాల్లో అమ్మ‌డు ఏ రేంజ్ పెర్పార్మెన్స్ చేసిందో తెలిసిందే. తాజాగా `క్రూ`లో అంత‌కు మించి అందాల విందు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్ల‌తో నే టబుని ఎంత హాట్ గా హైలైట్ చేస్తున్నారో? అర్ద‌మైంది. అంద‌చందాల‌తో ప్ర‌యాణికుల్ని బురిడికొట్లించే పాత్ర‌లో న‌టిస్తుంది. తాజాగా ఆ సినిమా ఆన్ సెట్స్ నుంచి ఓ ఫోటో లీకైంది. అందులో ట‌బు వేడి మాములుగా లేదు.

స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో ట‌బు ఘాటు ఫోజుకు కుర్రాళ్ల‌కు మ‌తి చెడాల్సిందే. అమ్మ‌డి మ్యాక‌ప్ ..అలంక‌ర‌ణ ప్ర‌తీది ట‌బు లో రొమాంటిక్ యాంగిల్ ని హైలైట్ చేస్తుంది. వ‌య‌సు ముదిరినా ఏమాత్రం త‌రిగిపోని అందంతో క‌నిక‌ట్టు చేస్తుంది. అమ్మ‌డి హాట్ అప్పిరియ‌న్స్ కి మ‌తి చెండాల్సిందే. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. కామెంట్ బాక్స్ లో కామెంట్లు అంతే ఘాటుగా క‌నిపిస్తున్నాయి.

ట‌బు బ్యూటీని పొగిడేస్తూ అభిమానులు హాట్ కామెంట్లు విసురుతున్నారు. క్రూ నుంచి ఫోటోల‌తోనే ఈ రేంజ్ లో ర‌చ్చ చేస్తుంటే? సన్నివేశాలు ఇంకే రేంజ్ లో ఉంటాయో? అది ఊహ‌కు సాధ్య‌మేనా అంటున్నారు. ఈ సినిమాలో ట‌బుతో పాటు కృతిస‌న‌న్..క‌రీనా క‌పూర్ కూడా న‌టిస్తున్నారు. వాళ్లు సైతం అదే తీరున అందాల దాడి చేయ‌నున్నారు. ఈ సినిమాని అన్ని ప‌నులు పూర్తిచేసుకుని మార్చి 29న రిలీజ్ అవుతుంది.