Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిట్టి గౌనులో సుహానా హొయ‌లు

ఇంత‌లోనే ఇప్పుడు సుహానా కొత్త ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. డార్క్ నేవీ బ్లూ మిడ్డీలో సుహానా అమాంతం హీట్ పెంచేసింది

By:  Tupaki Desk   |   1 Dec 2023 12:30 AM GMT
ఫోటో స్టోరి: చిట్టి గౌనులో సుహానా హొయ‌లు
X

జోయా అక్త‌ర్ 'ది ఆర్చీస్' నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగుకి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇందులో న‌టించిన న‌ట‌వార‌సులు సుహానాఖాన్- ఖుషీ క‌పూర్-అగ‌స్త్య నందా త‌దిత‌రులు ప్ర‌మోష‌న్స్ అద‌ర‌గొడుతున్నారు. ఇప్ప‌టికే సుహానా ఖాన్ వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. ఖాన్ డాట‌ర్ ఇంట‌ర్వ్యూల్లో ఎంతో తెలివిగా మాట్లాడుతోంది. ఆలియా భ‌ట్ లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ ని పొగిడేసి మీడియా అటెన్ష‌న్ ని త‌న‌వైపున‌కు తిప్పేసుకుంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ది ఆర్చీస్ కి ప్ర‌మోష‌న్ త‌గ్గ‌కుండా చేయ‌డంలో సుహానా పెద్ద స‌క్సెసైంది.


ఇంత‌లోనే ఇప్పుడు సుహానా కొత్త ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. డార్క్ నేవీ బ్లూ మిడ్డీలో సుహానా అమాంతం హీట్ పెంచేసింది. చిట్టి గౌనులో సుహానా థై సొగ‌సుల ఎలివేష‌న్ యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారింది. ది ఆర్చీస్ లో త‌న పాత్ర ప్ర‌వ‌ర్త‌న‌కు త‌గ్గ‌ట్టుగానే, విభిన్న‌మైన టీనేజ్ టెంప్టేష‌న్ దుస్తుల‌ను ఫోటోషూట్ల కోసం సుహానా ఎంపిక చేసుకుంటోంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి ఆస్కారం ఉన్న‌ అల్ట్రా మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లోను సుహానా ఎంతో సౌక‌ర్యంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా గ్లామ్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచంలో నెమ్మ‌దిగా ఎలా దూసుకెళ్లాలో నేర్చేసుకుంటోంది. ప్ర‌స్తుతం సుహానా మిడీ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

జోయా అక్తర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న‌ సుహానా ఖాన్, వేదంగ్ రైనా, ఖుషీ కపూర్, అగస్త్య నందా, డాట్, యువరాజ్ మెండా, మిహిర్ అహుజా ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్ కోసం ఎటువంటి అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ఈ యువత‌రం న‌టీన‌టులు సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ప్ర‌మోష‌న్స్ సాగిస్తున్నారు. టీవీ చానెళ్ల లైవ్ లు, న్యూస్ పేపర్ల ఇంట‌ర్వ్యూల‌కు అనుకూలంగా ఉన్నారు. ఇక ది ఆర్చీస్ తోనే సుహానా ఖాన్, వేదాంత్ గాయకులుగా అరంగేట్రం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అత‌డితో ప్రేమ‌లో ప‌డిందా?

ది ఆర్చీస్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో న‌టిస్తున్న క్ర‌మంలో కోస్టార్ అగ‌స్త్య నందాతో ఖాన్ డాట‌ర్ సుహానా ఖాన్ ఎంతో స‌న్నిహితంగా మెల‌గ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌కు తావిచ్చింది. అగ‌స్త్య‌-సుహానా జంట ప్రేమించుకుంటున్నార‌ని ఇద్ద‌రూ ఒక‌రిని విడికి ఒక‌రు ఉండ‌లేక‌పోతున్నార‌ని, ఈ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం ఇంట్లో కూడా తెలుసు, కాబ‌ట్టి వారికి కూడా ఇష్ట‌మేన‌ని కూడా ప్ర‌చారం సాగింది. అయితే ఈ జంట ఇత‌ర జంట‌ల్లానే త‌మ ప్రేమాయ‌ణాన్ని అంగీక‌రించ‌లేదు. అలాగని తిర‌స్క‌రంచ‌నూ లేదు.