Begin typing your search above and press return to search.

ప్రేమను చూస్తే సంతోషంగా ఉంది!

కన్నడ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు లో పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల

By:  Tupaki Desk   |   27 March 2024 4:18 AM GMT
ప్రేమను చూస్తే సంతోషంగా ఉంది!
X

కన్నడ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు లో పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ పడటంతో కాస్త స్లో అయ్యింది. అయినా కూడా ఈమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు కన్నడ మరియు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించిన శ్రీలీల ముందు ముందు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఒక కాలేజ్ ఈవెంట్‌ లో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

శివ కార్తికేయతో కలిసి శ్రీలీల ఆ ఈవెంట్‌ లో పాల్గొంది. ఆ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. తమిళనాట నన్ను ఎవరు గుర్తు పట్టరు అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ ఉన్న గుర్తింపు మరియు మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

మీ ప్రేమను చూసి ముందు ముందు తమిళ సినిమాల్లో నటించాలని కోరిక కలుగుతుంది. తప్పకుండా తమిళ సినిమాల్లో అతి త్వరలో నటిస్తాను అన్నట్లు పేర్కొంది. మీ ప్రేమను చూస్తూ ఉంటే తమిళ సినిమా చేయాలి అనిపిస్తుంది. తప్పకుండా త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ హామీ ఇచ్చింది.