Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఈ రూట్లో నెంబర్ వన్ అయ్యేనా?

ఎంతో మంది అందాల భామలు హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:52 AM GMT
శ్రీలీల.. ఈ రూట్లో నెంబర్ వన్ అయ్యేనా?
X

ఎంతో మంది అందాల భామలు హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే వారిలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే స్టార్ హీరోయిన్స్ గా మారుతారు. మిగిలిన వారు అవకాశాలు వచ్చిన కూడా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అందుకోలేరు. అలాగే టైర్ 1 హీరోలకి జోడీగా అవకాశాలు అందుకోలేరు. ప్రతి ఐదు, పదేళ్లకి ఇద్దరు, ముగ్గురు అందాల భామలు సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా కొంతకాలం తమ ప్రస్థానం కొనసాగిస్తారు.

కాజల్ అగర్వాల్, తమన్నా పదేళ్లు స్టార్ హీరోయిన్స్ గా సౌత్ లో చలామణి అయ్యారు. తరువాత సమంత దూసుకొచ్చింది. ఈమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దానికి పైగా అయిపొయింది. తరువాత రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఐదేళ్లు ట్రెండ్ సృష్టించింది. పూజా హెగ్డే కూడా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

సౌత్ తో పాటు హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కీర్తి సురేష్ కూడా రేసులో ఉంది. అయితే ఎక్కువ మూవీస్ చేయడం లేదు. ఇప్పుడు తెలుగులో శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో వచ్చింది. ఓ వైపు గ్లామర్ రోల్స్ చేస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తోంది.

అలాగే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా మెప్పిస్తోంది. నాలుగేళ్లలో ఈ బ్యూటీ 12 సినిమాలు చేసింది. తెలుగులో ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటున్న ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. గత ఏడాదిలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తే అందులో భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన మూడు డిజాస్టర్ అయ్యాయి. అందులో శ్రీలీల క్యారెక్టర్ కి పెద్ద ప్రాధాన్యత లేదు. ఈ ఏడాది ఆరంభంలో అయితే గుంటూరు కారం అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ ఆమెకు ఓ విధంగా క్రేజ్ మహేష్ కారణంగ క్రేజ్ పెరిగింది.

ముఖ్యంగా శ్రీలీల డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే నితిన్ కి జోడీగా వెంకీ కుడుములు చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయంట. తాజాగా ఈ విషయాన్ని శ్రీలీల కన్ఫర్మ్ చేసింది. త్వరలో వాటికి సంబందించిన ఎనౌన్సమెంట్ ఉంటుందని చెప్పుకొచ్చింది. శ్రీలీల ఇదే వేవ్ తో స్టార్ హీరోయిన్ చైర్ లోకి వెళ్లగలుగుతుందా అనేది వేచి చూడాలి.