Begin typing your search above and press return to search.

శ్రీలీల అక్క‌డా చ‌మ‌త్కారాలు గుప్పిస్తుందా?

న‌లుగురు ఇలా స‌ర‌దాగా ముచ్చ‌టించు కుంటోన‌న స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన పిక్ ఇది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:45 AM GMT
శ్రీలీల అక్క‌డా చ‌మ‌త్కారాలు గుప్పిస్తుందా?
X

శ్రీలీల ఎక్క‌డుంటే అక్క‌డ స‌ర‌దా వాతావ‌ర‌ణమే. క‌లివిడి మ‌న‌స్త‌త్వం గ‌ల అమ్మాయి. స్టార్ హీరోయిన్ అనే అహంభావం ఉండ‌దు. తార‌త‌మ్యం లేకుండా న‌టులంద‌రితో స‌ర‌దాగా ఉంటుంది. ఆఫ్ ది సెట్ లో ఎంత స‌ర‌ద‌గా ఉంటుందా? ఆన్ సెట్ లో అంత‌కు మించి స‌ర‌ద‌గా గ‌డుపుతుంది. ఇక అమ్మ‌డి జోకులు.. ముచ్చ ట్లు పెడితే స‌హ న‌టుల‌కు స‌మ‌య‌మే తెలియ‌దు. మాట్లాడుతూనే ఉంటుంది.

అలా ఎదుట వారిని ఆక‌ర్షించుకోవ‌డం శ్రీలీల ప్ర‌త్యేక‌త వేరు. తాజాగా సైమా వేడుక‌ల్లోనూ అలాంటి స‌న్నివేశ‌మే క‌నిపిస్తోంది. ఇటీవ‌ల దుబాయ్ లో జ‌రిగిన సైమా వేడుకులు తారా తోర‌ణ‌మంతా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

దీనిలో భాగంగా శ్రీలీల‌..శ్రీనిధి శెట్టి...శ్రుతిహాస‌న్.. అడ‌వి శేషు ఒకే వ‌రుస‌లో ముందు కుర్చున్నారు. అంతా శ్రీలీల వైపే చూస్తూ క‌నిపిస్తున్నారు. శేషు ..శ్రుతి హాస‌న్ అయి అయితే వొంగి వొంగి మ‌రీ శ్రీల‌ల‌ని ప‌రిశీలిస్తున్నారు.

మ‌రి ఆ స‌మ‌యంలో శ్రీలీల ఎలాంటి జోకులేసి వాళ్ల‌ని న‌వ్విస్తుందో! న‌లుగురు ఇలా స‌ర‌దాగా ముచ్చ‌టించు కుంటోన‌న స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన పిక్ ఇది. ఇక ఈ అంద‌మైన సుంద‌రాంగులు డిజైన‌ర్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. బ్లాక్ పింక్ కాంబినేష‌న్ శ్రీలీల ధ‌రించింది. శ్రీనిధి వైట్ డిజైన్ లో మెర‌వ‌గా..శ్రుతిహాస‌న్ టాప్ టూ బాట‌మ్ బ్లాక్ డిజైన్ దుస్తుల్లో మురిపిస్తుంది.

శ్రీలీల‌..శ్రుతి హాస‌న్ మెడ‌లో అంద‌మైన న‌క్లెస్ కూడా ధ‌రించారు. ఆ భామ‌ల నెక్ ని న‌క్లెస్ మ‌రింత అందంగా మ‌లిచింది. ఆ ప‌క్క‌నే అడివి శేషు వైట్ క‌ల‌ర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అందాల‌న్ని ఒకే వ‌రుస‌లో ఉన్నాయి. ఈ అందాల్ని చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదంటూ అభిమానం కురిపిస్తున్నారు.