Begin typing your search above and press return to search.

శ్రీలీల కూడా బ్రేక్ ఇస్తుందా?

మ‌రో రెండు నెల‌ల్లో ప‌రీక్ష‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మూడు నెల‌లు పాటు విరామం ప్ర‌క‌టించాల‌ని చూస్తోందిట‌.

By:  Tupaki Desk   |   25 Aug 2023 2:07 PM GMT
శ్రీలీల కూడా బ్రేక్ ఇస్తుందా?
X

ఇటీవ‌లే స‌మంత లాంగ్ బ్రేక్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏడాది పాటు ఎలాంటి సినిమాలు చేయ‌బోన‌ని.. విశ్రాంతి తీసుకుంటానని అమెరికా వెళ్లిపోయింది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు...అటుపై వ‌రుస‌గా షూటింగ్ లు.. ఈ మ‌ధ్య‌లో అనారోగ్యం బారిన ప‌డ‌టంతో ఇబ్బందుల‌కు గురైంది. దీంతో అల‌సిసొల‌సిన స‌మంత ఏడాది గ్యాప్ తీసుకుంటుంది. ప్ర‌స్తుతం ఆమె అమెరికాలో ఉంది.

ఈ నేప‌థ్యంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా బ్రేక్ తీసుకుంటుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. 'పెళ్లి సంద‌డి' సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన అనూహ్యంగా ఇండ‌స్ట్రీలో క్లిక్ అయిన వైనం తెలిసిందే. అమ్మ‌డి అందానికి..న‌ట‌న‌కి..ప్ర‌తిభ‌కి టాలీవుడ్ ఫిదా అయింది. దీంతో పెళ్లి సంద‌డి ఫ‌లితంతో సంబంధం లేకుండా అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు ప్ర‌మోట్ అయిపోయింది.

ఓ వైపు యంగ్ హీరోల‌తో సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల‌కు డేట్లు కేటాయిస్తుంది. వాళ్ల‌తో మెయిన్ లీడ్ నా? సెకెండ్ లీడ్ నా? అన్న‌ది ప‌క్క‌న‌బెట్టి ప‌నిచేస్తుంది. ఇలా చాలా సినిమాలు క‌మిట్ అయింది. వాటి షూటింగ్ ల‌తోనూ కొన్ని నెల‌లుగా బిజీ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మ‌డి అల‌సు డ్రీమ్ కాదు. డాక్ట‌ర్ కావాల‌న్న‌ది క‌ల‌. అనుకోకుండా న‌టి అయింది. న‌టిగా అవ‌కాశాలు రావ‌డంతో ఇటు వైపు వ‌చ్చింది. అలాగ‌ని డాక్ట‌ర్ చ‌దువు అశ్ర‌ద్ద చేయ‌లేదు.

చ‌దువుని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఫైనలియర్ పరీక్షలు ద‌గ్గ‌ర‌పడ్డాయి. మ‌రో రెండు నెల‌ల్లో ప‌రీక్ష‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మూడు నెల‌లు పాటు విరామం ప్ర‌క‌టించాల‌ని చూస్తోందిట‌. సినిమా ప్ర‌పంచానికి దూర‌మై పూర్తిగా చ‌దువుకు అంకిత‌మైపోవాలని చూస్తోందిట‌.

కొన్ని నెల‌లు పాటు త‌న‌ని డిస్ట‌ర్బ్ చేయోద్ద‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లకు చెప్పింది. న‌వంబ‌ర్ నుంచి ఈ బ్రేక్ షురూ చేస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమా ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా విరామం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.