Begin typing your search above and press return to search.

బాత్ ట‌బ్‌లో ఆవిరులు పుట్టించిన బ్యూటీ!

సోషల్ మీడియా, డిజిట‌ల్ వేదిక‌ల‌పై త‌మ అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో వ‌ల‌లు విస‌ర‌డం నేటి ట్రెండ్

By:  Tupaki Desk   |   31 Dec 2023 10:30 AM GMT
బాత్ ట‌బ్‌లో ఆవిరులు పుట్టించిన బ్యూటీ!
X

సోషల్ మీడియా, డిజిట‌ల్ వేదిక‌ల‌పై త‌మ అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో వ‌ల‌లు విస‌ర‌డం నేటి ట్రెండ్. యువ‌త‌రం న‌ట‌వార‌సురాళ్లతో పాటు, చాలా మంది న‌టీమ‌ణులు, అగ్ర క‌థానాయిక‌లు ప‌బ్లిక్ వేదిక‌ల‌పై య‌థేచ్ఛ‌గా త‌మ అందాల్ని ఆర‌బోస్తున్న తీరు విస్మ‌య‌ప‌రుస్తోంది. పోటీ ప్ర‌పంచంలో దూసుకెళ్లేందుకు సోష‌ల్ మీడియా ఆదాయాన్ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఇది ఒక బిజినెస్ ట్రిక్ గా భావిస్తున్నారు.

తాజాగా న‌టి కం మోడ‌ల్ సోనాలి రౌత్ తన స్పెష‌ల్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసింది. శనివారం నాడు ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన యూనిక్ వీడియో వైర‌ల్ గా మారింది. బాత్‌టబ్‌లో సోనాలి హొయ‌లు ఒలికించిన తీరు వేడి పెంచింది. సోనాల్ పింక్ అండ్ బ్లాక్ బికినీలో ఎంతో హాట్ గా క‌నిపించింది. ఇది చ‌న్నీటి స్నానం కాదు.. వేడి నీటి స్నానం.. టబ్‌లో ఉన్న‌ది వేడి నీళ్లు. దిల్జిత్ దోసాంజ్ ఆల‌పించిన 'కిన్ని కిన్ని..' బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తుండ‌గా సోనాల్ నీళ్లతో ఆడుకుంటూ కెమెరా ముందు హొయ‌లు పోయింది. ''నా సంతోషకరమైన ప్రదేశం!!!'' అనే క్యాప్షన్‌తో ఆమె వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోకు న‌టుడు అజాజ్ ఖాన్‌ సహా చాలా మంది నెటిజ‌నుల నుంచి స్పందనలు వచ్చాయి. మెరుపుల ఉరుములు.. హాట్ అంటూ ఫ్యాన్స్ ఘాటైన వ్యాఖ్య‌లు చేసారు. నీటిలో కూడా చాలా వేడిగా ఉంది అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. మరికొందరు కామెంట్స్ విభాగంలో ఫైర్ - రెడ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు.

సోనాలి రౌత్ చాలా సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా పాపులర్. తరచుగా ఆకర్షణీయమైన ఫోటోషూట్‌లు, తెరవెనుక వీడియోలను షేర్ చేస్తుంది. ఆన్‌లైన్‌లో సంచలనంగా మారుతోంది. సోనాల్ కేవలం 19 సంవత్సరాల వయస్సులో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2010పై క‌నిపించింది. 2014లో ది ఎక్స్‌పోజ్ చిత్రంతో తన నటనను ప్రారంభించింది. హిమేష్ రేషమియా - యో యో హనీ సింగ్‌లతో కలిసి నటించింది. త‌ర్వాత బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొంది. ఎంతో చమత్కారంగా బహిరంగంగా మాట్లాడే వ్యక్తిత్వంతో సోనాల్ వీక్షకులను అలరించింది. ఈ బ్యూటీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా స్థానం సంపాదించింది.. కానీ విన్న‌ర్ గా నిల‌వ‌లేదు.

2016లో సోనాలి 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రంలో షైనీగా నటించింది. లిప్ స్టిక్ లగా కే చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించింది. ఆమె కరణ్ సింగ్ గ్రోవర్ -బిపాసా బసు నటించిన డేంజరస్ వెబ్ సిరీస్‌లో కూడా ఒక పాత్ర‌తో మెప్పించింది. ఈ సిరీస్ కి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించగా, మికా సింగ్ నిర్మించారు.