Begin typing your search above and press return to search.

మరోసారి బికిని ట్రీట్ ఇచ్చిన సోనాల్..!

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా, అన్ని భాషల్లో ఛాన్సులు దక్కించుకుంటున్న నటీమణుల్లో సోనాల్ చౌహాన్ ఒకరు

By:  Tupaki Desk   |   11 Sep 2023 8:38 AM GMT
మరోసారి బికిని ట్రీట్ ఇచ్చిన సోనాల్..!
X

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా, అన్ని భాషల్లో ఛాన్సులు దక్కించుకుంటున్న నటీమణుల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. ఆమె అన్ని భాషల్లోనూ ఛాన్సుులు అందుకుంటూ అదరగొడుతోంది. అయితే, ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది.


సోనాల్ చాలా అందంగా ఉంటుంది. చూడగానే ఆకర్షించేలా కనపడుతుంది. యాక్టింగ్ కూడా అదరగొడుతోంది. కానీ, పాపం అదృష్టం కలిసిరాలేక అలా ఉండిపోయింది. కానీ, ఆమెకు ఉన్న టాలెంట్ కి ఎప్పుడో స్టార్ హీరోయిన్ కావాల్సి ఉంది. సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తూనే ఉంటుంది.

సోనాల్ కి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, సోనాల్ సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే, కుర్రాళ్లకు నిద్రపట్టదు అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో మతి పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఫ్లోరల్ బికినీలో ట్రీట్ ఇచ్చింది. ఆమె బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

మాల్దీవుల్లో ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. అక్కడ వాటర్ లో తడుస్తూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు ఫ్యాన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఈ బికినీలో చాలా అందంగా కనపడుతోంది. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని చాలా హాట్ గా, మరింత స్టైలిష్ గా కనపడుతోంది.

సోనాల్ జన్నత్ మూవీతో కెరీర్ ని ప్రారంభించారు. తెలుగులో రామ్ తో కలిసి పండగ చేస్కో మూవీలో మెరిసింది. ఆ తర్వాత నాగార్జున గోస్ట్ లో నటించింది. తెలుగులో ఎందరి హీరోలతో నటించినా.. నందమూరి బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో సోనాల్ ఆకట్టుకున్నారు. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రీసెంట్ గా ఆదిపురుష్ మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.