Begin typing your search above and press return to search.

వీడియో : హీరోయిన్ సాగర విన్యాసాలు

సాధారణంగా హీరోయిన్స్ సుకుమారంగా ఉంటారు.. సాహసాలు చేసేందుకు భయపడుతారు. కానీ సిమ్రాన్ చౌదరి మాత్రం సముద్రం పై స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:35 AM GMT
వీడియో : హీరోయిన్ సాగర విన్యాసాలు
X

హమ్‌ తుమ్‌ అనే తెలుగు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సిమ్రాన్ చౌదరి. ఈ అమ్మడు తెలుగు లో నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్స్ కారణంగా ఈ అమ్మడు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉన్న విషయం అందరికి తెల్సిందే.

రెండేళ్లుగా సినిమాలు ఏమీ లేకున్నా కూడా సిమ్రాన్ చౌదరి కి ఇంకా కూడా మంచి గుర్తింపు ఉంది అంటే కచ్చితంగా ఆమె యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ అనడంలో సందేహం లేదు. తాజాగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు మరో వీడియో ను షేర్‌ చేసింది. సముద్రం పై సాహసం చేస్తూ ఈ అమ్మడు షేర్‌ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా హీరోయిన్స్ సుకుమారంగా ఉంటారు.. సాహసాలు చేసేందుకు భయపడుతారు. కానీ సిమ్రాన్ చౌదరి మాత్రం సముద్రం పై స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలోనే ఈమె సముద్ర సాహసాలు చేస్తున్నట్లుగా ఉంది. కొత్తే అయినా కూడా ఎలాంటి భయం బెరుకు లేకుండా సిమ్రాన్ సముద్రంలో సాగర కన్య మాదిరిగా దూసుకు పోతుంది.

హాట్ ఫోటోలు మరియు వీడియో లను ఇలాంటి సాహస చర్యలకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడం ద్వారా సిమ్రాన్ చౌదరి ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటుంది. తద్వారా మళ్లీ సినిమా ల్లో ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.