Begin typing your search above and press return to search.

శ్రుతి అంత‌ర్జాతీయ పాకులాట‌

స్టార్ హీరోయిన్ శ్రుతిహ‌స‌న్ క‌థానాయిక‌గా రాణించ‌క ముందే పాపుల‌ర్ గాయ‌ని. పాప్ ప్ర‌పంచ‌పు రారాణి కావాల‌ని క‌ల‌లు కంది

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:18 AM GMT
శ్రుతి అంత‌ర్జాతీయ పాకులాట‌
X

స్టార్ హీరోయిన్ శ్రుతిహ‌స‌న్ క‌థానాయిక‌గా రాణించ‌క ముందే పాపుల‌ర్ గాయ‌ని. పాప్ ప్ర‌పంచ‌పు రారాణి కావాల‌ని క‌ల‌లు కంది. కానీ అనుకున్న‌ది సాధించుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. ఇప్ప‌టికీ త‌న ప్ర‌వృత్తిని విడిచిపెట్ట‌క అప్పుడ‌ప్పుడు గాయ‌నిగా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ షోలు చేస్తోంది. దీనికోసం ఒక అంత‌ర్జాతీయ మ్యూజిక్ బ్యాండ్ తో అనుబంధం క‌లిగి ఉంది. అదే స‌మ‌యంలో న‌టిగా ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపును శ్రుతిహాస‌న్ కోరుకుంటోంది.

'స‌లార్' గ్రాండ్ స‌క్సెస్ తో శ్రుతి పేరు మ‌రోసారి పాన్ ఇండియాలో వినిపించింది. హిందీ-తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో పాపులారిటీ ఉన్న‌ శ్రుతి హాసన్ కి స‌లార్ స‌క్సెస్ అస్సెట్ గా మారింది. త‌దుప‌రి ఈ భామ న‌టిస్తున్న చెన్నై స్టోరీ- డెకాయిట్ చిత్రాల‌కు ఇది క‌లిసి రానుంది. ఇప్పుడు చెన్నై స్టోరి చిత్రంతో అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపును శ్రుతి ఆశిస్తోంది. ఈ చిత్రానికి అంత‌ర్జాతీయంగా పాపులారిటీ ఉన్న BAFTA విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యధికంగా అమ్ముడైన టైమెరి N. మురారి నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇది రొమాంటిక్ కామెడీ. ఇందులో ప్రైవేట్ డిటెక్టివ్ అను పాత్ర లో శ్రుతి న‌టిస్తోంది. ఈ చిత్రం త‌మిళంతో పాటు ఆంగ్లం, తెలుగులోను విడుద‌ల కానుంది. వేల్స్ స‌హా భారతదేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాల న‌డుమ ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. చెన్నై స్టోరీని మించిన అద్భుత క‌థ‌తో రూపొంద‌నున్న యాక్షన్ చిత్రం 'డెకాయిట్'లో అడివి శేష్ స‌ర‌స‌న‌ శ్రుతి స్క్రీన్‌ను షేర్ చేసుకోనుంది. రాకింగ్ స్టార్ యష్ చిత్రం 'టాక్సిక్'లోను ఈ భామ న‌టిస్తోంద‌ని ప్ర‌చారం ఉంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ త్వరలో ప్రారంభం కానుంది. 'టాక్సిక్' చిత్రానికి మలయాళ నటుడు కం ఫిలింమేక‌ర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.