Begin typing your search above and press return to search.

శృతి హాసన్.. వ్వాటే గోల్డెన్ బ్యూటీ..

టైమ్ తో సంబంధం లేకుండా స్టార్ హోదాను పెంచుకుంటున్న వారిలో శృతిహాసన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:31 PM GMT
శృతి హాసన్.. వ్వాటే గోల్డెన్ బ్యూటీ..
X

టైమ్ తో సంబంధం లేకుండా స్టార్ హోదాను పెంచుకుంటున్న వారిలో శృతిహాసన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయింది. అయినప్పటికీ అదే తరహాలో హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. కేవలం యువ హీరోలతో మాత్రమే కాకుండా అగ్ర హీరోలతో కూడా అవకాశాలు అందుకుంటూ సరికొత్త తరహాలో ముందుకు సాగుతోంది.


ఒకవైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొకవైపు విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేస్తోంది. ఇక ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్ది కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలో గ్లామర్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో శృతిహాసన్ పోస్ట్ చేసే ఫోటోలు స్టన్ అయ్యేలా ఉంటాయి.


ఇక రీసెంట్ గా కూడా ఒక గోల్డెన్ కలర్ టాప్ లో అమ్మడు మతిపోగొట్టేసింది. ఇక అందాల రాక్షసి అనే ట్యాగ్ కు సరిపోయే విధంగా స్టిల్స్ ఇచ్చింది. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా వైరల్ అవ్వాల్సిందే అని మరోమారు నిరూపించింది. ఒక ఫ్రేమ్ లో వీపుపై ఉన్న టాటూ ను అందంగా హైలెట్ చేయగా మరో పిక్ లో తన పెదవి పై రంగును తగిలించి మరింత వయ్యారంగా కనిపించింది.

గ్లామర్ విషయంలో అమ్మడు ఎంత కొత్త తరహాలో ముందుకు సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగు తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఉమ్మడి చేతిలో అయితే చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్లోనే పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇక ఆ సినిమాతో పాటు తమిళంలో కూడా రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. నాని హాయ్ నాన్న సినిమాలో కూడా ఒక స్పెషల్ రోల్ చేసింది. ఇక వీటిలో ఏది సక్సెస్ అయినా కూడా అమ్మడు మరొక ఐదేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అప్పుడప్పుడు సొంతంగా ఈ బ్యూటీ మ్యూజికల్ ఆల్బమ్స్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక నిర్మాతగా కూడా ఆ మధ్య ఒక సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారని టాక్ వచ్చింది. మరి ఆ రూట్లో శృతిహాసన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.