Begin typing your search above and press return to search.

సేల్స్ గర్ల్ జాబ్.. ఇన్ స్టా ప్రేమ.. పెళ్లంటే బోరింగ్ : శృతి హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తండ్రికి తగ్గ తనయురాలు అనుకునేలా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది

By:  Tupaki Desk   |   15 Sep 2023 2:30 PM GMT
సేల్స్ గర్ల్ జాబ్.. ఇన్ స్టా ప్రేమ.. పెళ్లంటే బోరింగ్ : శృతి హాసన్
X

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తండ్రికి తగ్గ తనయురాలు అనుకునేలా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో శృతి హాసన్ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్స్ అందరితో కలిసి నటిస్తున్న శృతి హాసన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా శృతి హాసన్ సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.

ఓ నెటిజెన్ మీరు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నారని అడిగితే అందుకు సమాధానంగా శృతి హాసన్ సేల్స్ గర్ల్ కావాలని అనుకున్నా అన్నారు. అక్కడ వచ్చిన కస్టమర్స్ తో సరదాగా సంభాషించ వచ్చు అనే ఉద్దేశంతో అలాంటి జాబ్ చేయాలని అనుకున్నానని చెప్పారు శృతి హాసన్. కమల్ కూతురు సేల్స్ గర్ల్ డ్రీం ఏంటో అని ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇక మరొకరు సృతి లవర్ శాంతాను గురించి అడిగారు. అందుకు బదులిస్తూ శాంతాను ఆర్ట్ వర్క్ కి తను అభిమానిని.. అలా అతన్ని ఇన్ స్టా లో ఫాలో అవుతూ మెసేజ్ చేస్తే అతను రిప్లై ఇచ్చాడు. అలా పరిచయం కాస్త ప్రేమగా మారిందని అన్నారు.

అయితే శాంతానుతో ప్రేమ గురించి అంత ఓపెన్ గా చెప్పే శృతి హాసన్ పెళ్లెప్పుడు అంటే మాత్రం అది బోరింగ్ అనేసింది. ఇక మీకు టాటూలంటే ఎందుకు అంత ఇష్టమని మరో నెటిజెన్ అడగగా టాటూలంటే పిచ్చి 19 ఏళ్ల వయసులో మొదటి టాటూ వేయించుకున్నా నటిని కాకపోయి ఉంటే ముఖానికి తప్పించి అంతా టాటూ వేయించుకునే దాన్ని అంటూ సమాధానం ఇచ్చింది. మొత్తానికి ఫాలోవర్స్ తో సరదా చిట్ చాట్ శృతి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఆడియన్స్ కు తెలిశాయి.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఈ ఇయర్ ఆల్రెడీ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలు చేసిన శృతి హాసన్ ప్రభాస్ సలార్ తో పాటుగా నాని హాయ్ నాన్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇదే కాదు ది ఐ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తుంది. తెలుగులో రాబోయే రెండు సినిమాలు కూడా మంచి అంచనాలు ఉన్నవే కాబట్టి శృతి హాసన్ అదరగొట్టడం పక్కా అని చెప్పొచ్చు.