Begin typing your search above and press return to search.

అందానికి కొత్త చిరునామా..!

2018 లో ఆండ్రీ కొస్చీవ్ ని పెళ్లాడిన శ్రియ శరణ్ పెళ్లి తర్వాత సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది

By:  Tupaki Desk   |   14 March 2024 12:10 PM GMT
అందానికి కొత్త చిరునామా..!
X

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియా శరణ్ దాదాపు 22 ఏళ్ల నుంచి తెలుగుతో పాటుగా సౌత్ అన్ని భాషల్లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ వచ్చింది. అన్ని భాషల్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన శ్రియా శరణ్ అన్నిచోట్ల స్టార్ స్టేటస్ అందుకుంది. కెరీర్ లో టాప్ ప్లేస్ కి వెళ్లిన అమ్మడు తన మార్క్ నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చింది. కెరీర్ లో అవకాశాలు సన్నగిల్లాయి అనుకున్న టైం లో స్పెషల్ సాంగ్స్, క్యామియో రోల్స్ కూడా చేస్తూ వచ్చింది ఈ అమ్మడు.

2018 లో ఆండ్రీ కొస్చీవ్ ని పెళ్లాడిన శ్రియ శరణ్ పెళ్లి తర్వాత సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. హస్బెండ్ తో పబ్లిక్ లిప్ లాక్, ఘాటు ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరిస్తున్న శ్రియ శరణ్ రోజు రోజుకి ఆ డోస్ పెంచుతూ వచ్చింది. పెళ్లై ఒక పాపకి తల్లైనా కూడా శ్రియ గ్లామర్ షో విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. గ్లామర్ ఫీల్డ్ లో తమని తాము ఎప్పటికప్పుడు అందంగా ఎక్స్ పోజ్ చేసుకోవాలన్న రూల్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది శ్రియా శరణ్.

అందుకే కొత్త హీరోయిన్స్ చేసే ఫోటో షూట్స్ కన్నా శ్రియ శరణ్ ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. లేటెస్ట్ గా మరోసారి శ్రియ తన ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. శారీ లుక్ లో ఎక్కడ కవర్ చేయాలి ఎక్కడ ఓపెన్ చేయాలి అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఫోటో షూట్స్ షేర్ చేసింది శ్రియ శరణ్. అందానికి సరికొత్త చిరునామాగా శ్రియ చేసిన ఈ ఫోటో షూట్ ఆడియన్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పొచ్చు.

శారీలో కూడా ఇలా క్రేజీ హా**ట్ అప్పీల్ చేయొచ్చని శ్రియని చూసే నేర్చుకోవాలి. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కన్నడలో కబ్జా సినిమా చేసిన శ్రియ హిందీ తెలుగు బైలింగ్వెల్ మూవీగా మ్యూజిక్ స్కూల్ సినిమా చేసింది. హిందీ టీవీ సీరీస్ షో టైం లో కూడా నటించింది శ్రియ శరణ్. ఈ రేంజ్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న అమ్మడికి మళ్లీ లీడ్ రోల్ ఛాన్స్ వచ్చినా వచ్చేస్తాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా పెళ్లై ఒక బేబీ ఉన్నా కూడా శ్రియ గ్లామర్ మెయింటెనెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.