Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్ లో బర్త్‌ డే అందాల ఆరబోత

ఆ సందర్భంగా కోవెలం బీచ్ లో ఎంజాయ్ చేసింది. ఆ సందర్భంగా తీసుకున్న తన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:15 AM GMT
పిక్ టాక్ : బీచ్ లో బర్త్‌ డే అందాల ఆరబోత
X

హీరోయిన్ గా ఇష్టం సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అంతే అందంగా, యాక్టివ్‌ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌. సాధారణంగా హీరోయిన్స్‌ అయిదు పది సంవత్సరాల్లో ఫేడ్ ఔట్ అవుతూ ఉంటారు. తక్కువ మంది మాత్రమే పదేళ్లు, అంతకు మించి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు.


శ్రియ శరణ్ నాలుగు పదుల వయసు కి వచ్చింది. సినీ ఇండస్ట్రీ లో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. అయినా కూడా సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాకుండా వరుసగా సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న శ్రియ సోషల్‌ మీడియాలో మరోసారి సందడి చేసింది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా పుట్టిన రోజు జరుపుకుంది. ఆ సందర్భంగా కోవెలం బీచ్ లో ఎంజాయ్ చేసింది. ఆ సందర్భంగా తీసుకున్న తన హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. క్లీ వేజ్ అందాలతో పాటు నడుమ అందం చూపిస్తూ, పొట్టి స్కర్ట్‌ లో థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ చాలా హాట్ గా కనిపించింది.

శ్రియ ఫిజిక్ చూస్తూ ఉంటే నిజంగా ఈమెకు నాలుగు పదుల వయసు వచ్చిందా అన్నట్లు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వయసు పెరుగుతున్నా కొద్ది శ్రియ అందం పెరుగుతున్నట్లుగా ఈ బర్త్‌ డే ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.