Begin typing your search above and press return to search.

శ్రియా.. లెగ్స్ అందాల మాయ

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో శ్రియా శరణ్ ముందు ఉంటుంది. పాత జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అందరికీ శ్రియ పరిచయమే

By:  Tupaki Desk   |   15 Sep 2023 5:51 AM GMT
శ్రియా.. లెగ్స్ అందాల మాయ
X

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో శ్రియా శరణ్ ముందు ఉంటుంది. పాత జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు అందరికీ శ్రియ పరిచయమే. దశాబ్దానికి పైగా ఆమె టాలీవుడ్ ని ఏలింది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా అందరి సరసన నటించి, బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ఇప్పటికీ, ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, దక్షిణాదిన చాలా సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటింది.


ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు శ్రియా మంచి ఆప్షన్ గా నిలుస్తున్నారు. అయితే, ఆమె అందం మాత్రం ఈ కాలం హీరోయిన్ కి సవాలు విసురుతున్నట్లుగా ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది. ఇక, పెళ్లి, పిల్లలు తర్వాత మరింత గుర్తు పట్టలేనట్లుగా మారిపోతారు. కానీ, శ్రియా మాత్రం రోజు రోజుకీ అందాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి కంటే, ఇప్పుడు మరింత హాట్ గా తయారైంది. నిజంగా ఆమెను చూస్తుంటే వయసు పెరగడం ఆగిపోయిందా అనే సందేహం కలుగుతుంది.

ప్రస్తుతం వయసు ఆమె వయసు 40ఏళ్లు కానీ, ఇప్పటికీ చూడగానే ఆకట్టుకునే అందంతో మెరిసిపోతుంది. ఇక, సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా అలానే కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

త్వరలోనే శ్రియా తన పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే, తన ఫ్యామిలీతో కలిసి హాలీడేకి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఫుల్ లెంగ్త్ కోట్ లాంటి డ్రెస్ ధరించింది. ఇక, ఆ డ్రెస్ లో చూట్టు ఉన్న లొకేషన్స్ ని ఆమె ఎంజాయ్ చేస్తోంది. కొన్ని ఫోటోల్లో ఆమె తన థైస్ అందాలు చూపిస్తూ, ఫోజులు ఇవ్వడం విశేషం.

ఇక, శ్రియ రీసెంట్ గా హిందీ దృశ్యం సినిమాలో కనిపించారు. ఆర్ఆర్ఆర్ లోనూ కీలక పాత్ర పోషించారు. ఆమెకు ఇప్పటికీ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే , మరోవైపు తల్లిగా ఆమె తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. శ్రియకు ఓ కూతురు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు తన కూతురితో కలిసి సందడి చేసే ఫోటోలను సైతం ఆమె షేర్ చేస్తూ ఉంటారు.