Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: తెలుగ‌మ్మాయి డ్యాషింగ్ ఫోజులు వైర‌ల్

కాలంతో పాటే ప‌రుగు.. పోటీప్ర‌పంచంలో కెరీర్ పందెంలో దూసుకెళ్లాలంటే కొన్ని హ‌ద్దులు దాటాల్సి ఉంటుంది

By:  Tupaki Desk   |   14 Dec 2023 5:23 AM GMT
ఫోటో స్టోరి: తెలుగ‌మ్మాయి డ్యాషింగ్ ఫోజులు వైర‌ల్
X

కాలంతో పాటే ప‌రుగు.. పోటీప్ర‌పంచంలో కెరీర్ పందెంలో దూసుకెళ్లాలంటే కొన్ని హ‌ద్దులు దాటాల్సి ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో మెట్రో క‌ల్చ‌ర్ కి ధీటుగా స్మాల్ టౌన్ నుంచి వ‌చ్చిన తెలుగ‌మ్మాయిలు చెల‌రేగి అందాల‌ను ఆవిష్క‌రించ‌డం చ‌ర్చ‌గా మారుతోంది. కొంత‌కాలంగా తెలుగ‌మ్మాయి శ్రేయా ధన్వంతరి బోల్డ్ ఫోటోషూట్లు వెబ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.


తాజాగా మారోసారి శ్రేయ ధన్వంతరి తన కొత్త ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి పెంచింది. తనదైన‌ బోల్డ్ అవతార్‌తో అభిమానుల్లోకి శ్రేయ దూసుకెళ్లింది. శ్రేయ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో వైట్ కలర్ స్పోర్ట్స్ బ్రా ధరించి ఉన్న ఫోటోల బంచ్‌ను షేర్ చేసింది. ఈ లుక్ లో ఎలాంటి మేకప్ వేసుకోలేదు.. కానీ సెన్సాఫ్ లుక్ తో వేడిగా క‌నిపించింది. శ్రేయా ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటోషూట్ పై అభిమానులు కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలతో విరుచుకుప‌డుతున్నారు.

బోల్డ్ గా ధైర్యంగా వెళ్లడం తెలుగ‌మ్మాయి శ్రేయాకు ఇదే మొదటిసారి కాదు. గ‌తంలో బ్లేజర్ ధ‌రించి ఇన్న‌ర్ ఏమీ ధరించకుండా అందాల‌ను ఆర‌బోసిన ఫోటోషూట్ ని శ్రేయా షేర్ చేసింది. ఈ ఫోటోల‌పై శ్రేయ అభిమానులు అంతే ఇదిగా స్పందించారు. శ్రేయా డ్యాషింగ్ స్టైల్, ఎలివేషన్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

లేటెస్టుగా శ్రేయ బోల్డ్ షూట్ పై ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ..మాకు మరింత మోనోక్రోమ్ లుక్ కావాలి అని వ్యాఖ్యానించారు. మరొక అభిమాని ఇలా రాశారు. క‌చ్ఛితంగా చాలా అందంగా ఉంది అని వ్యాఖ్యానించ‌గా,,...మీరు చాలా వేడిగా ఉన్నారు అని మూడవ వ్య‌క్తి రాసారు. శ్రేయా డ్యాషింగ్ ఫోటోషూట్ ల‌పై నిరంత‌రం ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి. ఇది తెలుగ‌మ్మాయిల్లో ఊహించ‌ని మార్పు అని కూడా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

2009 తెలుగు సినిమా 'జోష్‌'(నాగ‌చైత‌న్య‌)తో శ్రేయ న‌ట‌న‌లోకి అడుగుపెట్టింది. స్నేహ గీతం, వై చీట్ ఇండియా, లూప్ లాపేట , చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ వంటి చిత్రాలలో న‌టించింది. అయితే మనోజ్ బాజ్‌పేయి ది ఫ్యామిలీ మ్యాన్‌తో శ్రేయాకు పెద్ద బ్రేక్ వచ్చింది. శ్రేయ తదుపరి సబ్బీర్ ఖాన్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అద్భుత్‌లో కనిపించనుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, డయానా పెంటీ, రోహన్ మెహ్రా నటించారు, దీనిని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. చివరిసారిగా రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన గన్స్ అండ్ గులాబ్స్‌లో రాజ్‌కుమార్ రావుతో కలిసి కనిపించింది. ఇందులో దుల్కర్ సల్మాన్, ఆదర్శ్ గౌరవ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ అంశాలతో కూడిన యాక్షన్-కామెడీ చిత్రమిది. ఇది 90ల నేప‌థ్యంలో క‌థాంశంతో తెర‌కెక్కింది.