Begin typing your search above and press return to search.

బ్లాక్ స్క‌ర్టులో శ్ర‌ద్ధా అందాల విందు

సాహో చిత్రంతో ద‌క్షిణాదినా ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్ర‌ద్ధా క‌పూర్. ప్ర‌భాస్ అభిమానులు ఈ బ్యూటీని పిచ్చిగా ఆరాధించారు

By:  Tupaki Desk   |   15 Jan 2024 3:15 AM GMT
బ్లాక్ స్క‌ర్టులో శ్ర‌ద్ధా అందాల విందు
X

సాహో చిత్రంతో ద‌క్షిణాదినా ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్ర‌ద్ధా క‌పూర్. ప్ర‌భాస్ అభిమానులు ఈ బ్యూటీని పిచ్చిగా ఆరాధించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాల్లోను శ్ర‌ద్ధాకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇన్ స్టాలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న క‌థానాయిక‌ల్లో శ్ర‌ద్ధా టాప్ 5లో నిలిచింది. ఇన్ స్టా వేదిక‌గా ఈ బ్యూటీ నిరంత‌రం షో స్టాప‌ర్ గా నిలుస్తోంది. ఇటీవల శ్ర‌ద్ధా తాజా ఫోటోషూట్ నుండి రేర్ క్లిక్స్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైన‌ర్ డ్రెస్ లో శ్ర‌ద్ధా భంగిమ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


శ్రద్ధా మెరిసే స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌ని ధరించింది. ఫ్లేర్డ్ బ్లాక్ స్కర్ట్‌తో సొగసైన చంద‌మామ‌ను త‌ల‌పించింది. మినిమ‌ల్ మేకప్, పర్ఫెక్ట్ ఐలైనర్‌తో షైనింగ్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. ఈ అంద‌మైన ఫోటోలను షేర్ చేస్తూ దానికి స‌ర‌దా క్యాప్షన్‌ను జోడించింది. ''హస్సీ హస్సీ మే పూరా సాట‌ర డే ఇన్‌స్టా పే నికల్ గయా నా???'' అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ లుక్ చూశాక‌.. సమంతా రూత్ ప్రభు వెంట‌నే స్పందించింది. శ్ర‌ద్ధా అంద‌మైన‌ రూపాన్ని చూసి 'లవ్' అని ఈమోజీలను షేర్ చేసింది.


గత సంవత్సరం దసరా సందర్భంగా శ్రద్ధా కపూర్ రూ.4 కోట్ల విలువైన సరికొత్త లంబోర్గినీ హురాకాన్ టెక్నికాను త‌న‌కు తానుగా బహుమతి ఇచ్చుకుంది. ఆ సమయంలో స్పోర్ట్స్ కారులో ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఆ తర్వాత అదే కారులో ఆలయానికి వెళుతున్న దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి. 2022లో భారతదేశంలో లాంచ్ అయిన‌ ఈ వేరియంట్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంద‌ని టాక్.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శ్రద్ధా కపూర్ నిరేన్ భట్ రాసిన 'స్ట్రీ 2' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్, అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ త‌దిత‌రులు ఇందులో నటిస్తున్నారు. చందు చాంపియ‌న్ అనే చిత్రంలోను శ్ర‌ద్ధా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.