Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సాహో బ్యూటీ విచిత్రమైన చీర కట్టు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో సాహో సినిమాలో నటించడం ద్వారా సౌత్‌ లో కూడా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకు పోతుంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 11:30 AM GMT
పిక్ టాక్ : సాహో బ్యూటీ విచిత్రమైన చీర కట్టు
X

2010 సంవత్సరంలో తీన్ పత్తి సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఈ అమ్మడు స్టార్‌ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా రెండేళ్లలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. నటిగా వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మరో వైపు సోషల్ మీడియా ద్వారా కవ్విస్తోంది.


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో సాహో సినిమాలో నటించడం ద్వారా సౌత్‌ లో కూడా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకు పోతుంది. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో ఏ ఫోటోలు లేదా వీడియోలు షేర్‌ చేసినా కూడా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా హీరోయిన్స్ చీర కడితే క్లీ వేజ్‌ షో చేస్తూ, నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంటారు. ఇతర మోడ్రన్ డ్రెస్ ల్లో కంటే చీర కట్టు లో ముద్దుగుమ్మలు అందంగా, సెక్సీ గా కనిపిస్తారు అనే టాక్ ఉంది. అలాంటి చీర కట్టు లో శ్రద్ధా కపూర్ ఏమాత్రం స్కిన్‌ షో చేయక పోవడం పట్ల అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వింతైన చీర కట్టు ఫోటోలు అవసరమా అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం ఎప్పుడూ స్కిన్‌ షో నేనా.. ఇలా కూడా శ్రద్ధా కపూర్ భిన్నంగా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ లు శ్రద్ధా కపూర్ ఎలా ఉందో మీరు లుక్కేసి కామెంట్‌ చేయండి.