Begin typing your search above and press return to search.

అక్కడ బిజీగా మారుతున్న శివాత్మిక..!

ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజశేఖర్ ముద్దుల కుమార్తె శివాత్మిక. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:10 AM GMT
అక్కడ బిజీగా మారుతున్న శివాత్మిక..!
X

ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజశేఖర్ ముద్దుల కుమార్తె శివాత్మిక. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పటి వరకు మంచి ఛాన్స్ అయితే రాలేదనే చెప్పాలి. స్టార్ కిడ్ హోదాలో అడుగుపెట్టినా, నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలానే కష్టపడిందనే చెప్పాలి.

ముఖ్యంగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ అన్నింటినీ తట్టుకొని ఆమె నటిగా నిలపడింది. అయితే, శివాత్మికకు తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయని చెప్పాలి. కాగా, తాజాగా మరో తమిళ సినిమాలో శివాత్మికకు ఆఫర్ వచ్చింది.

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ దాస్ సరసన హీరోయిన్ గా శివాత్మికను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ దాస్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆయన వాయిస్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, ఇప్పుడు అర్జున్ దాస్ కొత్త సినిమాలో శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

జెంబ్రియో పిక్చర్స్‌ బ్యానరుపై సుధా సుకుమార్‌ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాళి వెంకట్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిల నేరంగలిల్‌ సిల మణిదర్‌గల్‌’ ఫేం విశాల్‌ వెంకట్‌ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ ట్రైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరి ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అవుతుందో లేదో చూడాలి.

కాగా, ఈ సినిమా కథ చాలా బాగుందని,నాజర్ లాంటి నటులతో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అర్జున్ దాస్ పేర్కొన్నారు.

ఇక, శివాత్మిక విషయానికి వస్తే, దొరసానితో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత ఆకాశం, రంగమార్తండ, పంచతంత్ర, ఆంనదం విలయాడం లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు. మరి ఈ కొత్త మూవీతో ఆమె కెరీర్ ఇంకా ఎంత మారుతుందో చూడాలి.