Begin typing your search above and press return to search.

శాన్వీ.. వ్వాటే గ్లామర్ కిక్

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శాన్వీ శ్రీవాస్తవ. లవ్ లీ సినిమాతో టాలీవుడ్ లోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:25 AM GMT
శాన్వీ.. వ్వాటే గ్లామర్ కిక్
X

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శాన్వీ శ్రీవాస్తవ. లవ్ లీ సినిమాతో టాలీవుడ్ లోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ హిట్ కావడంతో వెంటనే సుశాంత్ కి జోడీగా అడ్డా సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. తరువాత కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చంద్రలేఖ అనే సినిమా చేసింది. ఈ మూవీ ఆమె కెరియర్ ని మార్చేసింది.


కన్నడనాట స్టార్ హీరోయిన్ అయిపొయింది. అయితే అందం, ఆకర్షణ ఉన్న కూడా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు తరువాత శాన్వీ పైన పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలుగులో తరువాత రౌడీ, ప్యార్ మే పడిపోయానే అనే సినిమాలలో నటించింది. ఈ రెండు పెద్దగా క్లిక్ కాలేదు. అయితే కన్నడంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. చివరిగా ఈ బ్యూటీ కన్నడంలో బాంగ్ అనే సినిమాలో కనిపించింది.


ప్రస్తుతం కన్నడ నాట త్రిశూలం, అలాగే మరాఠీలో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకి సినిమాల పరంగా దూరం అయిన సోషల్ మీడియాలో ద్వారా మాత్రం దగ్గరగానే ఉంది. రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫోటోషూట్ లని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పర్పెల్ కలర్ ఫ్రాక్ తో శాన్వీ తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వయ్యారాలు పోతూ కళ్ళజోడు పెట్టుకొని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలకి ఫ్యాన్స్ నుంచి ఇంటరెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టి 11 ఏళ్ళు దాటిపోయిన కూడా శాన్వీ అందంలో ఎలాంటి మార్పు లేదు.

ఈ అమ్మడు మరింత స్లిమ్ లుక్ లో హాట్ హాట్ ఫోటోలని కుర్రాళ్ళకి హీట్ పెంచుతూనే ఉంది. సరైన సినిమా పడితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి ఉండేది. కాని ఆరంభంలో అదృష్టం కలిసిరాకపోవడంతో టాలీవుడ్ కి దూరమైపోయింది.