Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : బీచ్‌ ఫోటోలతో మతి పోగొడుతోంది

ఈ అమ్మడు హిందీ లో చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా స్టార్‌ హీరోయిన్స్ కి ఉన్న ఫాలోయింగ్‌, గుర్తింపు ఉంది

By:  Tupaki Desk   |   3 March 2024 2:30 PM GMT
పిక్‌ టాక్ : బీచ్‌ ఫోటోలతో మతి పోగొడుతోంది
X

వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి, అక్కడ నుంచి బుల్లి తెరపై పరిచయం అయ్యి ప్రస్తుతం అక్కడ ఇక్కడ మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌. ఈ అమ్మడు హిందీ లో చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా స్టార్‌ హీరోయిన్స్ కి ఉన్న ఫాలోయింగ్‌, గుర్తింపు ఉంది.

నాలుగు పదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు అందం విషయంలో పోటీ అన్నట్లుగా ఉండే షామా సికిందర్ ఎప్పుడూ కూడా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసి అలరించింది. ఈసారి సముద్రపు ఒడ్డున సేద తీరుతూ ఉన్నట్లుగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. గతంలో పలు సార్లు బికినీ తో ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడు ఈసారి అంతకు మించి అన్నట్లుగా కవ్విస్తోంది.

ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి అందం ఈమె సొంతం అని, అందుకే నాలుగు పదుల వయసు లో కూడా ఇంత అందం కేవలం ఈమెకే సాధ్యం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంను బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ సాధ్యమైనంత ఎక్కువగా ప్రేక్షకులకు చూపించడం లో విఫలం అయ్యారు. సోషల్‌ మీడియాలో ఆ లోటు తీరింది. అందాల జాతరకు అంతా ఫిదా అవుతున్నారు.