Begin typing your search above and press return to search.

సాయంసంధ్యా వేళ ప‌రిమ‌ళించిన‌ పంజా బ్యూటీ

`పంజా` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఓమ‌న్ బ్యూటీ సారాజేన్ డ‌యాస్ సుప‌రిచిత‌మే. తెలుగులో అమ్మ‌డికి అదే తొలి సినిమా అదే చివ‌రి సినిమా.

By:  Tupaki Desk   |   9 Nov 2023 2:30 PM GMT
సాయంసంధ్యా వేళ ప‌రిమ‌ళించిన‌ పంజా బ్యూటీ
X

`పంజా` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఓమ‌న్ బ్యూటీ సారాజేన్ డ‌యాస్ సుప‌రిచిత‌మే. తెలుగులో అమ్మ‌డికి అదే తొలి సినిమా అదే చివ‌రి సినిమా. ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇండస్ట్రీలో క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందే కోలీవుడ్..బాలీవుడ్ చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చి మూడ‌వ ప్ర‌య‌త్నంగా తెలుగు లో న‌టించింది. కానీ అమ్మ‌డు మూడు చోట్లా రాణించ‌లేక‌పోయింది.


అటుపై హిందీలో కొన్ని సినిమాలు చేసి వెండి తెర‌కు దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో సారా వెబ్ సిరీస్ ల‌పై దృష్టి పెట్టింది. అక్క‌డా మాత్రం అమ్మ‌డు ఇంకా యాక్టివ్ గానే ఉంది. మూడేళ్ల నుంచి సారా వెబ్ సిరీస్ ల‌తోనే స‌రిపెట్టుకుంది. ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడు ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోల‌తో కాక పుట్టిస్తుంటుంది. రేర్ గా వ‌చ్చినా ర‌ప్పాండిచే ఫోటోల‌తో యువ‌త‌లో హాట్ టాపిక్ అవుతుంది.

ఆ మ‌ధ్య టూపీస్ బికినీ ఫోటోల‌తో రచ్చ చేసిన సారా మ‌రోసారి బీచ్ వేర్ లో ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసింది ఇదిగో ఇక్క‌డిలా సాయంసంధ్యా వేళ..పార్టీ స‌మ‌యంలో అమ్మ‌డు బీచ్ రిసార్స్ట్ లో ఇలా వైవిథ్య‌మైన ఫోటోల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. పువ్వుల డిజైన్ షోల్డ‌ర్ లెస్ క్యాజువ‌ల్స్ లో చూపరుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇసుక తిన్నుల్లో నెల‌వొంక‌కు ఎదురుగా..లైటింగ్ సెట‌ప్ లో అల‌రిస్తుంది.

ఇక సారా రూపంలో మాత్రం మార్పులు క‌నిపిస్తున్నాయి. బేసిక్ గానే సారా స‌న్న‌జాజిలా ఉంటుంది. తాజా పిక్ లో మ‌రింత స‌న్న‌గా క‌నిపిస్తుంది. అమ్మ‌డు తొలి నుంచి మంచి ఫిట్ నెస్ ప్రీక్. ఇప్ప‌టికీ అదే ఫిట్ నెస్ తో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. చాలా రోజుల త‌ర్వాత సారా క‌నిపించడంతో? సారాని ఎలా ఉన్నావ్? అంటూ అభిమానులు ప‌ల‌క‌రిస్తున్నారు.