Begin typing your search above and press return to search.

సంతోషం లేదా బాధ క‌లిగితే సామ్ ఏం చేస్తుంది?

సమంత రూత్ ప్రభు గ‌త కొంత‌కాలంగా మ‌యోసైటిస్ కి చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ తీరిక స‌మ‌యాన్ని త‌న‌దైన శైలిలో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా గ‌డిపేస్తోంది ఈ బ్యూటీ

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:14 AM GMT
సంతోషం లేదా బాధ క‌లిగితే సామ్ ఏం చేస్తుంది?
X

సమంత రూత్ ప్రభు గ‌త కొంత‌కాలంగా మ‌యోసైటిస్ కి చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ తీరిక స‌మ‌యాన్ని త‌న‌దైన శైలిలో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా గ‌డిపేస్తోంది ఈ బ్యూటీ. ఇంత‌కుముందు అమెరికాలో మ‌యోసైటిస్ చికిత్స‌ను పూర్తి చేసుకుని ఇండియాకి వ‌చ్చిన స‌మంత వెంట‌నే ముంబైకి వెళ్లారు. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ల‌ గురించి వెల్ల‌డిస్తుంద‌నే అంతా భావిస్తున్నారు. ఇంత‌లో సామ్ స‌డెన్ స‌ర్ ప్రైజ్ నిచ్చింది. తాజాగా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాధిస్తున్న‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసిన స‌మంత ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలిపింది.

సామ్ అమెరికా పర్యటన ముగించిన‌ప్ప‌టి నుండి కొత్త అప్ డేట్ ల‌ను చురుగ్గా పోస్ట్ చేస్తోంది. ఈ రోజు సమంత తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అందమైన ప్రకృతి ఫోటోల బంచ్‌ను షేర్ చేసింది.త‌న క‌ష్ట‌కాలంలో ఎక్కువ‌ ఇష్టపడే సినిమా గురించి కూడా స‌మంత వెల్లడించింది. ఈ పోస్ట్‌కు ప్రతిస్పందనగా అభిమానులు త్వరగా సామ్‌ను ఆప్యాయతతో ప‌ల‌క‌రించారు.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమంత ఇలా పోస్ట్ చేసింది. నేను చిన్నతనంలో చాలా సంతోషంగా లేదా చాలా బాధగా అనిపించినప్పుడు... నేను సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాని మళ్లీ చూసేదానిని. వాట‌న్నిటి నుంచి నేను తప్పించుకునే మార్గ‌మ‌ది. అది నన్ను నేను మ‌ర్చిపోయే మాయా ప్రపంచానికి తీసుకువెళుతుంది. నాకు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. అది ఓదార్పుగా వాస్తవం కాదు. నేను పెద్దయ్యాక సినిమాకి తిరిగి వెళ్తాను. కొన్ని సినిమాలు ప్రతి పునఃపరిశీలనతో మెరుగవుతాయి. కానీ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అలాగే ఉంటుంది. మ‌న బాల్యంలోకి మ‌న‌ల్ని ప్ర‌యాణించేలా చేస్తుంది. మీరు కూడా మీ బాల్యానికి తిరిగి వెళ్లండి... అని వ్యాఖ్య‌ను జోడించింది.

స‌మంత‌ అభిమాని ఒకరు స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు, ''జ్ఞాపకాలు గుండెకు శాశ్వతమైన రత్నాలు'' అని రాయ‌గా, మరొక అభిమాని, ''చాలా కాలం తర్వాత మీరు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మీకు బోలెడంత ప్రేమ'' అని వ్యాఖ్యానించారు. స‌మంత షేర్ చేసిన వాటిలో ప్రారంభ ఫోటోలో సమంతా సుందరమైన దృశ్యాన్ని ఆస్వాధిస్తున్నట్లు క‌నిపించ‌గా, రెండవది మొత్తం ఆ ప‌రిస‌ర‌ ప్రాంతాన్ని ప్రదర్శించే సంక్షిప్త వీడియోతో ఆక‌ట్టుకుంది. మూడవ పోస్ట్‌లో 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' సినిమాలోని ఒక సన్నివేశాన్ని స‌మంత‌ షేర్ చేసింది.

సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి'లో కనిపించింది. త‌దుప‌రి వరుణ్ ధావన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకున్న 'సిటాడెల్' భారతీయ వెర్ష‌న్ విడుద‌ల కానుంది. రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. ప్రస్తుతం 'సిటాడెల్ ఇండియా' గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ వీటి కథాంశాలను ప్రియాంక చోప్రా ఇటీవలే వెల్లడించారు. ప్రాంతీయ వెర్ష‌న్లు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయని తెలిపారు.