Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హీరోతో సాయి పల్లవి.. నిజమైతే జాక్ పాట్

సాయి పల్లవి కావాలని గ్యాప్ ఇచ్చిందా లేదంటే ఆమెకు నచ్చని ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయా అని ఫ్యాన్స్ లో కొంత సందేహాలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:11 AM GMT
పాన్ ఇండియా హీరోతో సాయి పల్లవి.. నిజమైతే జాక్ పాట్
X

మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సాయి పల్లవి ఎలాంటి పాత్ర చేసిన కూడా సినిమాలో దాదాపు హీరోలను డామినేట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె సౌత్ ఇండస్ట్రీలో మొదట్లో అయితే వరుస సక్సెస్ లతో చాలా బిజీగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు.

సాయి పల్లవి కావాలని గ్యాప్ ఇచ్చిందా లేదంటే ఆమెకు నచ్చని ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయా అని ఫ్యాన్స్ లో కొంత సందేహాలు వస్తున్నాయి. కానీ సాయి పల్లవి మాత్రం ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కూడా అందులో చేసే క్యారెక్టర్ తనకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తోంది. అంతే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా అసలు ఏమాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తుంది.

ఈ క్రమంలోనే చాలా ఆఫర్లను రిజెక్ట్ చేసినట్లు టాక్. ఇక ప్రస్తుతం అయితే సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు మరొక బిగ్ ఆఫర్ వచ్చినట్లుగా కొత్త తరహా గాసిప్ వైరల్ గా మారింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు కేజిఎఫ్ తో ప్రకంపనలు సృష్టించిన యష్ అనే తెలుస్తోంది. అతని 19వ సినిమా విషయంలో చాలా టైం అయితే తీసుకున్నాడు.

లేడీ డైరెక్టర్ తో గీతు మోహన్ దాస్ వర్క్ చేయబోతున్న ఆ ప్రాజెక్టుపై డిసెంబర్ 8వ తేదీన అధికారికంగా అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఆ సినిమాపై ఇటీవల యష్ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. సోషల్ మీడియాలో కూడా లోడింగ్ అంటూ హింట్ ఇవ్వడంతో త్వరలోనే ఆ సినిమా మొదలు కాబోతోంది అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి యష్ కు జోడిగా కనిపించబోతున్నట్లుగా కొత్త తరహా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజంగా సాయి పల్లవికి ఈ అవకాశం వస్తే ఆమె రేంజ్ మరో లెవల్ కు పెరిగినట్టే. ఇక సినిమా సక్సెస్ అయితే అమ్మడికే అంతకుమించి అనే అవకాశాలు ఉంటాయి. ఇక నిజంగా సాయి పల్లవి ఇందులో నటిస్తుందో లేదో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.