Begin typing your search above and press return to search.

మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి పల్లవి

అయితే సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మరల వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:34 AM GMT
మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి పల్లవి
X

ప్రేమమ్ సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ సాయి పల్లవి. తెలుగులో ఫిదా సినిమాతో తెరంగేట్రం చేసి టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది. తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతూ ఉంటారు. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశంలోనే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ గా సాయి పల్లవి గురించి చెప్పొచ్చు.

సాయి పల్లవి డాన్స్ లో ఒక గ్రెస్ ఉంటుంది. అది ఎవరినైనా ఇట్టే ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం విరాటపర్వం, తమిళంలో గత ఏడాది గార్గి మూవీతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ రెండు సినిమాలలో ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంది. అయితే సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మరల వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

గార్గి తర్వాత చాలా మూవీ ఆఫర్స్ వచ్చి తనకి నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం రిజక్ట్ చేసింది. ఫైనల్ గా శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కుతోన్న సినిమాకి ఒకే చెప్పింది. ఈ మూవీ రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాలీవుడ్ లోకి కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వడానికి సాయి పల్లవి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అమీర్ ఖాన్ తనయుడు డెబ్యూ మూవీలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఇప్పటికే స్టోరీ నేరేషన్ జరగడం, సాయి పల్లవికి కూడా నచ్చి ఒకే చెప్పడం జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఇలా వరుస ప్రాజెక్ట్స్ ని ఈ బ్యూటీ లైన్ లో పెట్టింది. దీంతో పాటు బాలీవుడ్ లో మధు మంతెన నిర్మాణంలో తెరకెక్కనున్న రామాయణంలో సీత పాత్రకి సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమాలకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.