Begin typing your search above and press return to search.

అల్లు రామాయ‌ణం.. సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి?

సాయిప‌ల్ల‌వి సీత పాత్ర‌లో న‌టిస్తుందా లేక ఇంకేదైనా పాత్ర కోసం సంప్ర‌దిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 1:30 AM GMT
అల్లు రామాయ‌ణం.. సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి?
X

అల్లు రామాయ‌ణం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. ఆదిపురుష్ ప‌రాజ‌యం త‌ర్వాత రామాయ‌ణం ఆధారంగా రూపొందుతున్న మ‌రో సినిమా ఇది. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ సినిమాని అల్లు అర‌వింద్ - మ‌ధు మంతెన మిత్ర‌ద్వ‌యం నిర్మించ‌నున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. నితీష్ తివారీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇటీవల 'రామాయణం' ప్రాజెక్ట్ నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టించేందుకు అవ‌కాశాలున్నాయ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంత‌లోనే కేజీఎఫ్ స్టార్ యష్ ని రావణాసురుని పాత్ర కోసం సంప్ర‌దించార‌ని.. అత‌డిపై లుక్ టెస్ట్ జ‌రిగిందని క‌థ‌నాలొచ్చాయి.

అంతేకాదు ఆలియా భ‌ట్ ఈ చిత్రంలో సీత పాత్ర‌లో న‌టించేందుకు ఆస్కారం ఉంది.. అయితే త‌న‌ను ఇంకా మేక‌ర్స్ సంప్ర‌దించలేద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే ఆలియాకు సంబంధించిన మ‌రో కీల‌క అప్ డేట్ అందింది.

నితీష్ తివారీ - రామాయ‌ణంలో ఆలియా న‌టించేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే త‌న‌కు కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో ఇప్పుడు నితీష్ బృందం మ‌రో క‌థానాయిక‌ను సీత పాత్ర కోసం వెతుకుతోంది.

చిత్ర‌బృందానికి చెందిన ఓ వ్య‌క్తి వివ‌రాల ప్ర‌కారం.. తాజాగా ట్యాలెంటెడ్ న‌టి సాయిప‌ల్ల‌విని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్ర‌దించేందుకు ఆసక్తిగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నితేష్ తివారీ రామాయణంలో సాయి పల్లవి కథానాయికగా నటించే అవకాశం ఉంద‌ని రిపోర్ట్ అందింది. సాయిప‌ల్ల‌వి సీత పాత్ర‌లో న‌టిస్తుందా లేక ఇంకేదైనా పాత్ర కోసం సంప్ర‌దిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇప్ప‌టికి ఇంకా రామాయ‌ణం కాస్టింగ్ పై ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేదు. మునుముందు దానికి స‌మాధానం మేక‌ర్స్ నుంచి ల‌భిస్తుంది. ఇక ఈ సినిమాని తొంద‌ర‌ప‌డి ఏదోలా తెర‌కెక్కించే ఆలోచ‌న నిర్మాత‌ల‌కు లేదు. అందువ‌ల్ల ఇది సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. క్వాలిటీ కోసం తివారీ తన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి తొంద‌ర‌ప‌డ‌డు. ప్ర‌తిసారీ చాలా సమయం కేటాయిస్తాడ‌ని కూడా విశ్లేషిస్తున్నారు .దంగల్ కోసం నితేష్ తివారీ రెండేళ్లు వేచి చూసాడు. అతను అంకితభావం ఉన్న‌ దర్శకుడు. మంచి సినిమా తీసేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాడ‌ని దంగల్ ని జనవరి 2014లో ప్రకటించినా డిసెంబర్ 2016లో విడుదల చేయ‌డానికి అత‌డి రాజీలేని త‌త్వ‌మే కార‌ణ‌మ‌ని సోర్స్ చెబుతోంది.