Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల 'గని' హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్ మేకర్‌ మహేష్ మంజ్రేకర్‌ కుమార్తె అయిన సాయి మంజ్రేకర్‌ తెలుగులో 'గని' చిత్రంతో అడుగు పెట్టింది

By:  Tupaki Desk   |   28 Dec 2023 7:53 AM GMT
పిక్ టాక్‌ : అందాల గని హీరోయిన్‌
X

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్ మేకర్‌ మహేష్ మంజ్రేకర్‌ కుమార్తె అయిన సాయి మంజ్రేకర్‌ తెలుగులో 'గని' చిత్రంతో అడుగు పెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో తెలుగులో ఈమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంతో పాటు పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు.


అడవి శేష్‌ తో కలిసి ఈమె నటించిన మేజర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఆ సినిమాతో కూడా దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. దాంతో తెలుగు సినిమాలకు దూరంగా ఉండి బాలీవుడ్ లో సినిమాల ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నించింది.


దబంగ్ 3 సినిమా లో హిందీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు మళ్లీ అక్కడే బిజీ అవుతోంది. ఇక సోషల్‌ మీడియా ద్వారా అప్పుడప్పుడు ఈ అమ్మడు మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె తన అందమైన ఫోటో షూట్‌ ను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

బ్లాక్ డ్రెస్ లో సాయి మంజ్రేకర్‌ చాలా అందంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఆమె అందమైన ఎక్స్‌ప్రెషన్స్ తో చూపరులను కవ్విస్తోంది. ఈరేంజ్ లో అందంగా ఉన్నా కూడా టాలీవుడ్‌ లో ఈమెకు దక్కాల్సిన గౌరవం మరియు గుర్తింపు దక్కక పోవడం విచారకరం. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.