Begin typing your search above and press return to search.

బుగ్గలపై హీరో నాలుక.. హీరోయిన్ కు చేదు అనుభవం

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సదా. ఆమె తెలుగులో చాలా మంది హీరోలతో నటించారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 8:40 AM GMT
బుగ్గలపై హీరో నాలుక.. హీరోయిన్ కు చేదు అనుభవం
X

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సదా. ఆమె తెలుగులో చాలా మంది హీరోలతో నటించారు. మంచి హిట్లు కూడా అందుకున్నారు. అయితే, సదా కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా జయం చెప్పొచ్చు. అది ఆమె తొలి సినిమా. నితిన్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో, వీరిద్దరూ మంచి స్టార్ లుగా మారిపోయారు. డైరెక్టర్ తేజ కి కూడా గుర్తింపు లభించింది.


ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్. సినిమా పాటలు, సినిమా కథ చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. దాంతో సినిమాలో నటించిన నటీనటులందరికి మంచి పేరు వచ్చింది. అయితే, ఈ మూవీలో తనకు ఇష్టం లేకపోయినా ఓ సీన్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ఈ మూవీలో, ఇంట్లో వారికి ఇష్టం లేకుండా హీరో, హీరోయిన్లు ప్రేమించుకొని పారిపోతారు. ఆ సమయంలో వారిని వెంబడిస్తూ విలన్ గోపీచంద్ కూడా అక్కడకు వస్తాడు. సినిమా క్లైమాక్స్ లో నితిన్, గోపిచంద్ తలపడే ముందు సదాపై వికృతంగా ప్రవర్తిస్తుంటాడు విలన్. అందులో భాగంగా గోపిచంద్ సదా బుగ్గపై నాలుకతో నాకే ఒక సీన్ ఉంటుంది. దానికి గురించి చెబుతూ తనకు ఆ సీన్ చేయడం ఇష్టం లేదని డైరెక్టర్‌తో చెప్పేసిందట. అయితే, ఇష్టం లేకపోయినా ఆ సీన్ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

ఆ సీన్ కచ్చితంగా సినిమాకి, హైలెట్‌గా నిలుస్తుందిని తేజ కన్విన్స్ చేయడంతో ఆ సీన్ పూర్తి చేశానని ఆమె చెప్పారు. అయితే, ఆ సీన్ చేసిన తరువాత ఇంటికెళ్లి చాలా సేపు ఏడ్చినట్లు చెప్పారు. పదే పదే తన ముఖం కడుక్కున్నట్లు చెప్పింది. ఇప్పటికీ తనకు ఆ సీన్ తలుచుకుంటే భయం వేస్తుందని చెప్పారు. ఇప్పటికీ, జయం సినిమా టీవీలో వస్తే, ఆ సీన్ మాత్రం తాను చూడనని, అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పడం విశేషం.

డైరెక్టర్ తేజ చెప్పినట్లు జయం మూవీలో ఆ సీన్ హైలెట్ అనే చెప్పాలి. విలన్ లోని విలనిజాన్ని ఈ సీన్ తో హైలెట్ గా చూపించారు. కాగా, సదా చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.