Begin typing your search above and press return to search.

కుర్రకారు గుండెల్లో గిటార్ వాయిస్తున్న కోహ్లీ మరదలు!

సైంధవ్ సినిమా ఫ్లాప్ అయినా.. రుహాని యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో కూడా సందడి చేసింది

By:  Tupaki Desk   |   14 March 2024 6:29 PM GMT
కుర్రకారు గుండెల్లో గిటార్ వాయిస్తున్న కోహ్లీ మరదలు!
X

క్యూటీ రుహానీ శర్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. యంగ్ హీరో సుశాంత్ నటించిన చిలసౌ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హిమాచల్ ప్రదేశ్ భామ. ఆ తర్వాత ఆమె నటించిన హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సైంధవ్ సినిమా ఫ్లాప్ అయినా.. రుహాని యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో కూడా సందడి చేసింది. త్వరలోనే ఆమె నటించిన శ్రీరంగనీతులు మూవీ విడుదల కానుంది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతోపాటు పలు వెబ్ సిరీసులను కూడా లైన్‌లో పెట్టింది. అలా టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. వచ్చిన ఛాన్సులను మిస్ చేసుకోకుండా రాణిస్తోంది.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటో షూట్స్ తోపాటు తన ట్రిప్ నకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. సినిమాల్లో స్కిన్ షో లేని పాత్రల్లో కనిపించినా.. నెట్టింట ఈ బ్యూటీ అందాల ఆరబోతకు కొదవేలేదు. క్లీవేజ్ షోలతో కట్టిపడేస్తుంటోంది.

ఇటీవల ఓ ట్రిప్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్రేజీ క్యాప్షన్ ఇచ్చి బటర్ ఫ్లై ఎమోజీ ఇచ్చింది. వైట్ కలర్ డ్రెస్ తో బీచ్ లో ఉన్న రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బ్యాక్ లెస్ టాప్, వెట్ పొట్టి మిడ్డీ, ట్రెండీ క్యాప్, గ్లాసెస్ తో ఓ రేంజ్ లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చేతిలో బుల్లి గిటార్ వాయిస్తూ నవ్వుతోనే ఫిదా చేస్తోంది. నైట్ వ్యూ పిక్ అయితే వేరే లెవల్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం రుహానీ శర్మ షేర్ చేసిన ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యామని అంటున్నారు నెటిజన్లు. మరికొందరు సూపర్ కోహ్లీ మరదలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో రుహానినే.. కోహ్లీ తనకు బావ అవుతారని చెప్పింది. ఇక కొత్త సినిమాలతో సూపర్ హిట్లు కొట్టి.. స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ బ్యూటీ లక్ ఎలా ఉందో చూడాలి.