Begin typing your search above and press return to search.

తీరంలో అందాల జలకన్యలా రుహనీ శర్మ

చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రుహనీ శర్మ. తరువాత హిట్ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది

By:  Tupaki Desk   |   5 Sep 2023 5:05 AM GMT
తీరంలో అందాల జలకన్యలా రుహనీ శర్మ
X

చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రుహనీ శర్మ. తరువాత హిట్ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తరువాత తెలుగులో నూటొక్క జిల్లాల అందగాడు, డర్టీ హరి సినిమాలలో నటించింది. ఈ మూవీస్ పెద్దగా ఆమెకి ప్లస్ కాలేదు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది.


అలాగే హిందీలో ఆగ్రా అనే మూవీ చేస్తోంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే పాయిజన్, మీట్ క్యూట్ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. సినిమాలలో ఈ బ్యూటీ ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే కనిపించింది. అయితే బయట మాత్రం అల్ట్రా మోడరన్ గా కుర్రకారు మతిపోగొట్టే అందాలతో గ్లామర్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన హాట్ ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రుహనీ శర్మ అందాల జాతరకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. రెగ్యులర్ గా ఆమె ఇచ్చే అప్డేట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా కాఫీ కలర్ లాంగ్ కటింగ్ ఫ్రాక్ లో సముద్ర తీరంలో ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ షోకేస్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాక్ లో థైస్ అందాలు నిండుగా చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది.

గ్లామర్ రోల్స్ కి కూడా తాను సై అనే సంకేతాలు ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఇస్తూనే ఉంది. అయితే మన దర్శకులు మాత్రం కేవలం సాఫ్ట్ అండ్ క్యూట్ పాత్రలకి మాత్రమే ఆమెని ఎంపిక చేస్తున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ హెర్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ సిరీస్ తరహాలోనే దీనిని చేయాలని ప్లాన్ చేశారు. అయితే మూవీ డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం ఈ అమ్మడు హోప్స్ అన్ని కూడా సైంధవ్ చిత్రం మీదనే ఉంది. ఈ మూవీ సక్సెస్ అయితే మళ్ళీ తనకి అవకాశాలు క్యూ కడతాయని భావిస్తోంది. మరి రుహనీ అందాలతో సోషల్ మీడియాలోనే కాకుండా బిగ్ స్క్రీన్ పై మురిపించే స్థాయిలో గ్లామర్ రోల్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.