Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెచ్చ‌గొడుతున్న రెజీనా

అవును.. రెజీనా రెచ్చ‌గొడుతోంది! కుర్ర‌కారును అదే ప‌నిగా టీజ్ చేస్తోంది. ఇదిగో ఇక్క‌డ ఈ లుక్ చూశాక ఇది అవున‌ని అంగీక‌రిస్తారు

By:  Tupaki Desk   |   7 April 2024 5:57 AM GMT
ఫోటో స్టోరి: రెచ్చ‌గొడుతున్న రెజీనా
X

అవును.. రెజీనా రెచ్చ‌గొడుతోంది! కుర్ర‌కారును అదే ప‌నిగా టీజ్ చేస్తోంది. ఇదిగో ఇక్క‌డ ఈ లుక్ చూశాక ఇది అవున‌ని అంగీక‌రిస్తారు. అంత‌గా చెల‌రేగిపోవ‌డానికి, అదే ప‌నిగా రెచ్చిపోవ‌డానికి కెరీర్ లో అంత జోష్ మూవ్ మెంట్ ఏం ఉంది? అంటే క‌చ్ఛితంగా త‌న లైఫ్ లో ప్ర‌తి అప్ అండ్ డౌన్ ని ఎంజాయ్ చేస్తాన‌ని చెప్పే రెజీనా ఎప్పుడూ ఇలా జోష్ ఫుల్ గానే క‌నిపిస్తోంది.

సైకాల‌జీలో డిగ్రీ పూర్తి చేసిన చెన్నై బ్యూటీ రెజీనా ద‌శాబ్ధ కాలం క్రిత‌మే టాలీవుడ్ లో న‌టిగా ప్ర‌వేశించింది. ప‌రిశ్ర‌మ‌లో పోటీ ఎంత ఉన్నా కానీ, త‌న‌కంటూ కొన్ని అవ‌కాశాల్ని సృష్టించుకుని కెరీర్ బండిని తెలివిగా లాగించేస్తోంది. ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల ట్రెండ్ కూడా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. అయితే ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో రెజీనా ప‌రిశ్ర‌మ గురించి మాట్లాడిన కొన్ని విష‌యాలు గుర్తు తెచ్చుకోవాలి.

ఇటీవ‌ల ప‌రిశ్ర‌మ ట్రెండ్ మారింది. అందుకే తాను ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాన‌ని రెజీనా తెలిపారు. క్వీర్ కథలు, పాత్రలకు మరింత ఎక్కువ ప్రచారం ల‌భిస్తుండ‌డంతో రెజీనా కసాండ్రా.. సినిమా పరిశ్రమ కాలంతో పాటు అభివృద్ధి చెందిందని భావిస్తున్న‌ట్టు చెప్పింది. ``సినిమా అనేది పరిణామానికి సంబంధించినది. ఇది క‌చ్చితంగా మంచి వైపు అభివృద్ధి చెందుతుంది. ఈ పరిణామం ప్రారంభ ద‌శ‌లో ఉన్న కాలంలో నేను న‌టిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. కొంతకాలం క్రితం నుండి పరిశ్రమ ఎదుగుద‌ల‌ను చూడటం ఆనందంగా ఉంది`` అని అన్నారు. ఇటీవ‌ల తాను హిజ్రా పాత్ర‌ను పోషించ‌గా దానిని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్న తీరుకు సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

ప్రతిచోటా LGBTQIA+ కమ్యూనిటీలో భాగం కానప్పటికీ, జనాభాలో ఒక విభాగం ఎల్లప్పుడూ మిత్రపక్షంగా ఉంటుంది. కానీ ఈ సామాజిక అంశాలను అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. అవగాహన పెరిగింది. సినిమా చాలా వరకు ఆ దిశ‌గా ఆలోచనల‌కు ఆకృతినిచ్చింది అని రెజీనా తెలిపింది. నేను న‌టించిన పాత్ర‌లు నిజానికి వ్యక్తులను ప్రభావితం చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందని కూడా తెలిపింది. మునుముందు మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు రెజీనా ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే రెజీనా వరుస చిత్రాల‌తో బిజీగా ఉంది. త‌ళా అజిత్ విదా ముయార్చిలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న రెజీనా, బోర్డ‌ర్ - ఫ్లాష్ బ్యాక్, సెక్ష‌న్ 108 అనే చిత్రాల్లోను న‌టిస్తోంది. ఇవ‌న్నీ ఈ ఏడాది విడుద‌ల‌కు రానున్నాయి.