Begin typing your search above and press return to search.

రెజినా ఈసారి కొత్తగా..!

తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్ కి మంచి అవకాశాలే వస్తాయి. కానీ రెజినా మాత్రం తన పంథా మార్చాలనే ఆలోచనతో రెగ్యులర్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యింది

By:  Tupaki Desk   |   21 Sep 2023 7:00 AM GMT
రెజినా ఈసారి కొత్తగా..!
X

తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న రెజినా అసలైతే అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లే స్టఫ్ ఉన్నా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. తనతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అంతా కూడా స్టార్స్ తో నటించి సూపర్ ఫాం కొనసాగించగా రెజినా మాత్రం యువ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కమర్షియల్ సినిమాలే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తుంది రెజినా.

తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్ కి మంచి అవకాశాలే వస్తాయి. కానీ రెజినా మాత్రం తన పంథా మార్చాలనే ఆలోచనతో రెగ్యులర్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ తెలుగులో షాకిని డాకిని సినిమాలో నటించిన రెజినా ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలమైంది. రెజినా తన నెక్స్ట్ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

రీసెంట్ గా అమ్మడు ఒక హర్రర్ మూవీకి సైన్ చేసిందట. సెల్విన్ రాజ్ సేవియర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. హాలీవుడ్ స్టైల్ లో కొన్ని విషయాలను చెప్పబోతున్నామని డైరెక్టర్ అంటున్నారు. సరికొత్త కథాంశంతో ఈ సినిమా లో హర్రర్ తో కూడిన ఫాంటసీ అంశాలు ఉంటాయని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా రూపొందించామని అంటున్నారు. సినిమాలో ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించామని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

రెజినా ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. కెరీర్ లో ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రెజినాకు ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో సెక్షన్ 108 సినిమా చేస్తున్న రెజినా ఈ హర్రర్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటుందని చెబుతున్నారు. ఒక్కో హీరోయిన్ ఒక్కో పాత్రకు పర్ఫెక్ట్ గా అనిపిస్తారు. కానీ కొంతమంది భామలు ఎలాంటి పాత్రలు చేసినా ఆ పాత్రకు సూట్ అవుతారు. అలా ఏ పాత్రకైనా సరిపోయే వారిలో రెజినా ఒకరు ఆమెను సరిగా వాడుకోలేదు కానీ అమ్మడిలో చాలా టాలెంట్ ఉందని తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రతిసారి ప్రయత్నిస్తుంది. రాబోయే సినిమాలు రెజినాను తిరిగి ఫాంలోకి తెస్తాయేమో చూడాలి.