Begin typing your search above and press return to search.

పిల్ల‌ల ముందే ర‌వీనా టాండ‌న్ ప్రేమ క‌హానీలు!

పాత రోజుల్లో ప్రేమ‌..పెళ్లి..రిలేష‌న్ షిప్ లాంటి విష‌యాలు ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు చెప్పాలంటే! ఎలాంటి ప‌రిస్థితులు ఉండేవో తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2023 2:30 AM GMT
పిల్ల‌ల ముందే ర‌వీనా టాండ‌న్ ప్రేమ క‌హానీలు!
X

పాత రోజుల్లో ప్రేమ‌..పెళ్లి..రిలేష‌న్ షిప్ లాంటి విష‌యాలు ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కు చెప్పాలంటే! ఎలాంటి ప‌రిస్థితులు ఉండేవో తెలిసిందే. చెప్పాలంటేనే బోలెడంత ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. ఇప్పుడా ప‌రిస్థితుల‌కు భిన్నంగా స‌మాజం ఉంది. ల‌వ్..రిలేష‌న్ షిప్ అనే చాలా కామ‌న్ గా మారిపోయాయి. ఇంట్లో తెలిసినా! ఏం చేస్తారులే ? అన్న ధీమా అంద‌రిలోనూ క‌నిపిస్తుంది. తాజాగా పిల్ల‌ల విష‌యంలో తానెంత ఓపెన్ గా ఉంటుందో బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

హీరోయిన్ గా బిజీగా ఉన్న స‌మ‌యంలో ర‌వీనా టాండ‌న్-అక్ష‌య్ కుమార్ ప్రేమించుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో జ‌ర్నీ మ‌రోలా సాగింది. అటుపై ర‌వీ టాండ‌న్ బిజినెస్ మ్యాన్ అనీల్ తడానీ వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ర‌వీనా టాండ‌న్ సెకెండ్ ఇన్నింగ్స్ కూడా జోరుగానే సాగుతుంది.

అయితే త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా ర‌వీనా టాండ‌న్ పిల్ల‌ల‌తో ఎంతో ఓ పెన్ గా షేర్ చేసుకుంటుంది. త‌న గ‌త జీవితం గురించి పిల్ల‌లిద్ద‌రికీ ముందే చెప్పిందిట‌. ఒక‌వేళ అలా దాస్తే జ‌రిగే లాభం క‌న్నా న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుందంటోంది. ఈరోజు కాక‌పోక‌యినా త‌ర్వాత ఏదో రూపంలో ఆ విష‌యాలు తెలియ‌డం కన్నా త‌న ద్వారా తెలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని అంటోంది.

`నా గురించి ఎ ఫైర్ వార్త‌లు పేప‌ర్లో ఏదో రోజు వ‌స్తాయి. వాటిని నా పిల్ల‌లు చ‌దువుతారు. పాత కాలంలో ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎన్నో క‌థ‌నాలు రాసారు. బాడీ షేమింగ్ చేసారు. ర‌వీనా అలా చేసిందిట‌. ఇలా చేసింద‌ట అన్ని చాలా అవాస్త‌వాలు వ‌చ్చాయి. వాటి గురించి నా పిల్ల‌ల‌కు ముందే చెప్పాను. వాటిని దాచి ..వారికి వారుగా తెలుసుకున్న‌ప్పుడు నిజంగా నేను త‌ప్పు చేసాను? అన్న భావ‌న‌ వాళ్ల‌లో క‌లుగుతుంది. అలాంటి ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌నే నాజీవితంలో జ‌రిగిన ప్ర‌తీ విష‌యాన్ని పిల్ల‌ల‌కు ముందుగానే చెప్పాను. నా గురించి ఎలాంటి వార్తలొచ్చినా వారు ప‌ట్టించుకోరు` అని అంది.