Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌ బ్యూటీ గ్లామర్ బ్లాస్ట్.. నెవ్వర్ బిఫోర్..

రతికా రోజ్‌.. బిగ్‌ బాస్‌ ముందువరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్‌ బాస్‌ తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:05 AM GMT
బిగ్‌బాస్‌ బ్యూటీ గ్లామర్ బ్లాస్ట్.. నెవ్వర్ బిఫోర్..
X

రతికా రోజ్‌.. బిగ్‌ బాస్‌ ముందువరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్‌ బాస్‌ తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌-7 సీజన్‌లో కంటెస్టెంట్‌ గా వచ్చిన రతిక.. తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఒక్క టాస్క్‌ కూడా గెలవకపోయినా తనదైన స్ట్రాటజీలు వాడి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది.


సీజన్ లో తొలి మూడు వారాల వరకు అందరి ఫోకస్‌ అంతా ఆమెపైనే ఉండేది. మధ్యమధ్యలో లవ్‌, బ్రేకప్‌ అంటూ ఎమోషనల్‌ గా మాట్లాడేది. టాస్క్‌ల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చేది. హౌస్ లో శివాజీ శిష్యురాలుగా పేరు తెచ్చుకున్న రతిక.. నాలుగో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది. కానీ ఉల్టా పుల్టా సరికొత్త కాన్సెప్ట్‌ తో మళ్లీ హౌస్ లో అడుగుపెట్టింది.


ఇదిలా ఉంటే.. బిగ్‌ బాస్‌ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతిక సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటోంది. తరచూ తన కిర్రాక్ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. ఇటీవలే గ్లామర్‌ డోస్‌ మరింత పెంచిన రతిక.. తాజాగా పొట్టి నిక్కర్‌ లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వైట్ షర్ట్‌, ప్రింటెడ్ నిక్కర్‌, బ్లాక్ ఇన్నర్ లో హీటెక్కించే అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసింది. "ఎదుటి వారి ప్రవర్తన మీ ఆత్మశాంతిని నాశనం చేయనివ్వకండి!!" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ ఇచ్చింది. ట్రెండీ గ్లాసెస్ పెట్టుకున్న ఆమె లుక్స్ తో పాటు గ్లామర్‌ కు కుర్రాళ్లు ఫిదా అవుతూ తమదైన స్టైల్ లో కామెంట్స్‌ పెడుతున్నారు.


సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రతికా రోజ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సంస్థలకు అంబాసిడర్‌ గా వ్యవహరించింది. ఆ సమయంలో పటాస్ షోలోకి వచ్చి స్టాండప్‌ కమెడియన్‌ గా సందడి చేసింది. ప్రియ అనే పేరుతో పాల్గొన్న ఆమె.. తనదైన కామెడీతో అలరించింది. ఆ తర్వాత కూడా పలు షోల్లో కనిపించి మంచి పేరును తెచ్చుకుంది.

బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీతో సినిమాల్లోకి అడుగు పెట్టింది రతిక. ఆ తర్వాత నారప్ప, అశోక వనంలో అర్జున కళ్యాణం, భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో నటించింది. ఇక స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న సమయంలో అతడితో ప్రేమలో పడిందట. చాలా రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని వీరిద్దరూ తిరిగారట. తర్వాత ఎందుకనో బ్రేకప్ చెప్పుకున్నారట. ఇదంతా బిగ్‌బాస్‌ తర్వాతే బయటకు వచ్చింది.