రష్మిక కెరీర్ నిలబడాలంటే.. ఆ రెండిటిపైనే ఆశలు
ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సొంతం చేసుకున్న బ్యూటీ రష్మిక.
By: Tupaki Desk | 24 Sept 2023 1:32 PM ISTఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సొంతం చేసుకున్న బ్యూటీ రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పుష్ప లాంటి భారీ సక్సెస్‌తో పాన్ ఇండియా లెవల్లో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసింది.
అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. బోల్తా కొట్టింది. హిందీలో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్స్ రాలేదు. అలానే ఆఫర్లు కూడా తగ్గిపోయాయనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం గుడ్ బై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసిన మిషన్ మజ్ను సినిమా కూడా ఆడలేదు. ఇక ఆమె మూడో చిత్రం యానిమల్. తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించారు.
ఈ యానిమల్ సినిమాపైనే రష్మిక ఆశలు పెట్టుకుంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా రిజల్ట్‌పైనే ఆమె బాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది. ఇక తమిళంలోనూ ఆమె అంతగా సక్సెస్ కాలేదు. తొలి చిత్రం సుల్తాన్ అంత పెద్ద హిట్ కాలేదు. వారిసు కూడా ఆడలేదు. దీంతో ఆమెకు అక్కడ కూడా ఆఫర్లు తగ్గాయి.
ఇక తెలుగులో ఆమె అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఒక్కటే చేస్తోంది. రవితేజ-గోపిచంద్ మలినేని సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలిసింది. ఇక తన మాతృ భాష కన్నడపై ఆమె ఫోకస్ తగ్గించేసింది. అక్కడ ఎక్కువ సినిమాలు చేయట్లేదు.
అంటే యానిమల్, పుష్ప 2 రిజల్ట్స్ పైనే ఆమె కెరీర్ డిపెండ్ అయి ఉంది. ఒకవేళ యానిమల్ పోయినా పుష్ప 2 హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి రష్మిక.. తన పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటూ ఓ స్ట్రాజజీతో ఆఫర్లను అందుకోవడం ముఖ్యం. అప్పుడు కెరీర్లో మరింత ఉన్నత స్థాయి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
